ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా సినిమాల్లో.. పుష్ప2 కూడా ఒకటి. పుష్ప సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టారు సుకుమార్ ఈసారి అస్సలు తగ్గేలేదే అంటున్నారు. ప్రస్తుతం పుష్పరాజ్, షెకావత్ సార్ మధ్య అదిరిపోయే సీన్స్ షూట్ చేస్తున్నాడట సుకుమార్.
పెరిగిన పాన్ ఇండియా అంచనాలకు తగ్గట్టుగా స్క్రిప్టు కోసం చాలా సమయం తీసుకున్నాడు సుకుమార్. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో పుష్ప2ని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాడు. మరి ప్రస్తుతం పుష్పరాజ్ ఏం చేస్తున్నాడు? అంటే, విలన్లకు చుక్కలు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మన షెకావత్ సార్‌కు చెమటలు పట్టిస్తున్నాడట. పుష్ప2 లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్లో షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం. పుష్పరాజ్ ఎర్రచందనం దుంగలను ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించే పనిలో ఉంటే..షెకావత్ సార్ పుప్పరాజ్ని పట్టుకునే పనిలో ఉన్నాడట.
ఇక ఇప్పటివరకూ మొత్తం 40 శాతం షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి.. వచ్చే సమ్మర్ కానుకగా ఏప్రిల్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో.. మళయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సునీల్, అనసూయ, రావు రమేష్‌తో పాటు పలువురు నటిస్తున్నారు.