HYderabad : కుషాయిగూడలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం
కుషాయిగూడలోని ఓ టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున టింబర్ డిపో(Timber depo)లో మంటలు ఏర్పడి ముగ్గురు సజీవదహనమయ్యారు. దట్టమైన పొగ వ్యాపించడంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు.
HYderabad : హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు(Fire accident) నగరవాసులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటీవల స్వప్నలోక్ కాంప్లెక్స్, శాస్త్రీపురం, నాచారంలో జరిగిన వరుస అగ్నిప్రమాద ఘటన మరువక ముందే ఇక తాజాగా మరోసారి కుషాయిగూడలోని ఓ టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున టింబర్ డిపో(Timber depo)లో మంటలు ఏర్పడి ముగ్గురు సజీవదహనమయ్యారు. దట్టమైన పొగ వ్యాపించడంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది(Fire Department) ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దట్టమైన పొగ కమ్మేయడంతో మంటలను ఆర్పేందుకు సిబ్బందికి ఇబ్బంది కలిగింది. అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు గల వివరాలను ఇంకా తెలియాల్సి ఉంది.
ఇటీవల నాచారం పోలీస్ స్టేషన్(Nacharam police station) పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మల్లాపూర్ పారిశ్రామికవాడలో జేపీ ఇండస్ట్రీస్ కంపెనీలో భారీగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్(Short Circuit) కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని ఫైర్ శాఖ ప్రాథమిక నిర్దారించారు. కనీస ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే భారీ అగ్నిప్రమాదం సంభవించిందని పేర్కొన్నారు. మొత్తం 11 ఫైర్ ఇంజన్ లు అదనంగా 40 వాటర్ ట్యాంకర్ ద్వారా ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చారు. దీంతో జేపీ పెయింటింగ్ కంపెనీ(Painting Company)లో మంటలు పూర్తిగా అదుపులో వచ్చాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా నిర్ధారించారు.