Uttam And Ponnam: తెలంగాణ గట్టు మీద రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన పార్టీల మధ్య విమర్శలు పెరిగాయి. కొందరు ముఖ్య నేతలు పార్టీ మారతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam), పొన్నం ప్రభాకర్ (Ponnam) పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. అదేం లేదని ఆ ఇద్దరు నేతలు స్పష్టంచేశారు.
తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam) అంటున్నారు. పార్టీ మారేది లేదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీతోనే తన ప్రయాణం కొనసాగుతోందని తేల్చిచెప్పారు. ఉత్తమ్ కుమార్ (Uttam) బీఆర్ఎస్ పార్టీలోకి వెళుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అందుకోసమే ఉత్తమ్ (Uttam) మరోసారి క్లారిటీ ఇచ్చారు.
మరో ముఖ్య నేత పొన్నం ప్రభాకర్ (Ponnam) పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగింది. ఇటీవల ప్రకటించిన కమిటీల్లో ఆయనకు చోటు లభించలేదు. దాంతో పార్టీ మార్పు ప్రచారానికి ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై పొన్నం (Ponnam) స్పందిస్తూ.. పార్టీ మారడం లేదని చెప్పారు. రాష్ట్రంలో తమ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ నెల 30వ తేదీన కొల్లాపూర్లో జరిగే సభకు హాజరవుతానని స్పష్టంచేశారు.