పెద్దపల్లి మున్సిపాలిటీ నూతన ఛైర్మన్‌గా ఇటీవల ఎన్నికైన నూగిల్ల మల్లయ్య బుధవారం ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మరియు పాలకవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి పాలకవర్గం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.
VKB: యాలాల్ మండల కేంద్రానికి చెందిన భాగ్యలక్ష్మి ప్రసవానికి 108లో హాస్పిటల్ వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో ఆమెకు పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో అంబులెన్సును పక్కకాపి EMT నితిన్, పైలట్ మహేందర్ డెలివరీని విజయవంతంగా పూర్తి చేశారు. భాగ్యలక్ష్మి పండంటి బాబుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.
WNP: జిల్లాలోని అన్ని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవసరమైన అన్ని సౌకర్యాలను విద్యార్థులకు కల్పించాలని అధికారులకు సూచించారు.
ADB: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ కలిసి సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును, గదుల్లో సౌకర్యాలను వారు స్వయంగా పరిశీలించారు.
JN: కొడకండ్ల మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 244 మంది విద్యార్థులు నమోదు కాగా, అందరూ హాజరయ్యారు. ఒక్క విద్యార్థి కూడా గైర్హాజరు కాలేదు. పరీక్షా కేంద్రంలో కట్టుదిట్టమైన పర్యవేక్షణతో పాటు అవసరమైన సౌకర్యాలు అధికారులు ఏర్పాటు చేశారు.
NRPT: మరికల్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బుధవారం నిర్వహించిన మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 204 మంది విద్యార్థులకు గాను 197 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 7 మంది విద్యార్థులు పరీక్షకు గైహాజరైనట్టు ప్రిన్సిపల్ నాగమణి మాల తెలిపారు. పరీక్షల సందర్భంగా పోలీసులు 144 సెక్షన్ విధించారు.
KMR: ఇంటర్, పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కామారెడ్డి, బాన్సువాడ డిపోల పరిధిలో విద్యార్థులు చెయ్యి ఎత్తిన చోట బస్సు ఆపాలని డిపో మేనేజర్లు డ్రైవర్లను ఆదేశించారు. మార్చి 16 వరకు ఇంటర్, ఏప్రిల్ 7 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా ఈ వెసులుబాటు కల్పించారు.
WGL: కాకతీయ యూనివర్సిటీలో వాయిదా పడిన MCA మొదటి సెమిస్టర్ పరీక్షల కొత్త షెడ్యూల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కట్ల రాజేందర్ వెల్లడించారు. మొదటి పేపర్ మార్చి 6న, రెండవ పేపర్ మార్చి 9న, మూడవ పేపర్ మార్చి 11న, నాలుగవ పేపర్ మార్చి 13న, ఐదవ పేపర్ మార్చి 17న నిర్వహించనున్నారు. పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి.
MDK: నర్సాపూర్ ఇన్‌ఛార్జి ఆవుల రాజిరెడ్డి బుధవారం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా సికింద్లాపూర్ గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. ఆయన మహిళల సాధికారత, ఆర్థిక స్వాలంబన కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
BDK: పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు బుధవారం కరకగూడెం మండలం చొప్పాల గ్రామ పరిధిలోని గొడుగుబండ వద్ద వట్టివాగు ప్రాజెక్టును పరిశీలించారు. రైతులకు రెండుపంటలు పండేలా ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని సూపర్వైజర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
BHPL: గోరికొత్తపల్లి(M) నిజాంపల్లి గ్రామంలోని 1వ వార్డులో బుధవారం గ్రామ సర్పంచ్ సునీత-రవీందర్ ఆధ్వర్యంలో GP కార్మికులు సైడ్ డ్రైనేజీ కాలువలు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.
MLG: జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ 2025-26 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం కింద అర్హత గల ప్రైవేట్ పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి తెలిపారు. అర్హత గల విద్యార్థులు మార్చి 25వ తేదీ లోపు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
MHBD: ద్విచక్ర వాహనాలపై జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చే వారందరికీ హెల్మెట్ తప్పనిసరి అని ఎస్పీ డాక్టర్ శబరీష్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. వారిని కలవడానికి వచ్చే ప్రజలు, ఫిర్యాదుదారులు, బాధితులు, కార్యాలయంలో పనిచేసే సిబ్బందితో సహా ఎవరైనా సరే హెల్మెట్ లేకుండా కార్యాలయ ప్రాంగణంలోకి అనుమతి లేదని సెక్యూరిటీ సిబ్బందికి స్పష్టం చేశారు.
NZB: నవీపేట్ మండల రైతులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు యూరియా బుకింగ్ విధానంలోమార్పులు చేసినట్లు ఏఈఓ వినోద్ తెలిపారు. ఇకపై రైతులు ఇతర మండలాల్లోయూరియా బుక్ చేసే అవకాశం రద్దు చేసి,కేవలం తమ సొంత మండలంలోనే బుక్ చేసుకునేలా యాప్‌ను అప్‌డేట్ చేశారు. నేటి నుంచే ఈ విధానం అమలులోకి వస్తుందని, దీని వల్ల స్థానిక రైతులకు యూరియా లభ్యత సులువవుతుందని అధికారులు పేర్కొన్నారు.
NLG: బీసీలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించాకే ఎన్నికలు జరపాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం దేవరకొండలో అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని నిరసన వ్యక్తం చేశారు.