• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నడిగూడెంలో ఇంటర్ పరీక్షా కేంద్రాల తనిఖీ

SRPT: నడిగూడెం మండల కేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యుడు జీ.శ్రీనివాస్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ, విద్యార్థులకు కల్పించిన వసతులను ఆయన పరిశీలించారు. ఎక్కడా మాల్‌ ప్రాక్టీస్‌కు తావులేకుండా నిబంధనల ప్రకారం పరీక్షలు సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

February 25, 2026 / 05:01 PM IST

సదాశివనగర్‌లో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

కామారెడ్డి జిల్లాలోనీ సదాశివనగర్ మండల కేంద్రంలో బుధవారం కళ్యాణ లక్ష్మీ పథకం కింద మంజూరైన చెక్కులు బుధవారం పంపిణీ చేశారు. జాయింట్ కలెక్టర్ విక్టర్ హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో సహాయపడుతోందన్నారు. ఈ సందర్భంగా బాధితులు ధన్యవాదాలు తెలిపారు.

February 25, 2026 / 05:01 PM IST

మంచి మనసును చాటుకున్న యువకులు

MNCL : జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలో గాజుల సత్తయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న చత్రపతి శివాజీ యూత్ సభ్యులు రూ. 5000, 25 కేజీల రైస్ బ్యాగ్ బుధవారం అందజేసి, మంచి మనసును చాటుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపాడుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చత్రపతి శివాజీ యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

February 25, 2026 / 05:01 PM IST

పోలీసులతో ఇంటర్న్‌షిప్, వాలంటరీలుగా చేసే ఛాన్స్..!

HYD పోలీసులు విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తూ ఆధునిక పోలీసింగ్‌లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో ముందడుగు వేశారు. ఇంటర్న్‌షిప్, వాలంటరీ కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. 25 సం.రాల లోపు డిగ్రీ, పీజీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు https://form.jotform.com వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు.

February 25, 2026 / 05:00 PM IST

చెక్‌పోస్టులో గోవా మద్యం పట్టివేత

NRPT: కృష్ణ మండలం గుడెబల్లూరు గ్రామ శివారులోని సరిహద్దు చెక్‌పోస్టు వద్ద మంగళవారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న గోవా మద్యం పట్టుబడింది. వాహనాల పరిశీలనలో ఎన్టీపీ 9 రకానికి చెందిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శంకర్ నాయక్, సీఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.

February 25, 2026 / 04:58 PM IST

GHMC మూడుముక్కలు.. కేసుపై GHMC కసరత్తు

HYD: 1996 జీవో 570 ప్రకారం జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన జరగలేదని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి జీహెచ్ఎంసీ, పురపాలక శాఖకు మూడు వారాల గడువు మంజూరు చేసింది. నిర్ణీత సమయంలో కౌంటర్లు సమర్పించాలని ఆదేశించింది. దీంతో సమాధానంపై GHMC, పురపాలక శాఖ పకడ్బందీగా కసరత్తు చేస్తూ నిర్విరామంగా కష్టపడుతోంది.

February 25, 2026 / 04:50 PM IST

రోడ్డు ప్రమాదాలు విధి కాదు.. మన నిర్లక్ష్యమే

మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. రహదారి ప్రమాదాలు విధి రాత కాదని, మన నిర్లక్ష్య ఫలితమేనని ఆయన పేర్కొన్నారు. ప్రతి రోజూ దేశంలో 450 మంది ప్రమాదాల్లో మరణించడం ఆందోళనకరమని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని మరియు ట్రాఫిక్ నియమాలు పాటించాలని విద్యార్థులకు సూచించారు.

February 25, 2026 / 04:50 PM IST

మూసి పరివాహక ప్రాంతల్లో రెడీమిక్స్ కాలుష్యం..!

HYD: మూసి పరివాహక ప్రాంతాలు, జంట జలాశయాల చుట్టుపక్కల రెడీమిక్స్ పరిశ్రమలు విస్తరిస్తున్నాయి. గండిపేట, హిమాయత్ సాగర్ ప్రాంతాల్లో కాలుష్యంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. రాజేంద్రనగర్, శంషాబాద్, మొయినాబాద్, ప్రతాప్ సింగారం ప్రాంతాల్లో యూనిట్లు అధికంగా పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ధూళి, శుద్ధి చేయని వ్యర్థ జలాలు జలాశయాలకు ముప్పుగా మారుతున్నాయి.

February 25, 2026 / 04:47 PM IST

జిల్లాలోని శుభకార్యాలలో పాల్గొన్న.. మాజీ MLA

BHPL: భూపాలపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జరిగిన వివాహ వేడుకలు, ఇతర శుభకార్యాలలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ MLA నూతన వధూవరులను హృదయపూర్వకంగా ఆశీర్వదించి, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

February 25, 2026 / 04:46 PM IST

ప్రభుత్వ ఆసుపత్రి నీ పరిశీలించిన ఎమ్మెల్యే

KMM: సత్తుపల్లి పట్టణంలోని నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి నీ బుధవారం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి పరిశీలించడం జరిగింది. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైద్య పరికరాల గురించి ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మట్ట దయానంద్. సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మన్ రహీనా బేగం ఎంపీడీవో ఎమ్మార్వో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

February 25, 2026 / 04:45 PM IST

50 మంది విద్యార్థులు గైర్హాజరు

KNR: జమ్మికుంట పట్టణంలోని మూడు కేంద్రాల్లో బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జనరల్ విభాగంలో 22 మంది, ఓకేషనల్‌లో 28 మంది.. మొత్తంగా 50 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అధికారులు ‘సెట్-బి’ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేయగా, ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు.

February 25, 2026 / 04:44 PM IST

మల్కాజ్‌గిరి పరిధిలో పెరిగిన దోమల బెడద

MDCL: మల్కాజ్‌గిరి పరిధిలోని బండ చెరువు, షఫీ నగర్, హనుమాన్ నగర్, మౌలాలి, భారత్ నగర్ ప్రాంతాల్లో దోమల విపరీతంగా పెరిగినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల వద్ద నిల్వ నీరు, డ్రైనేజీ సమస్యల వల్ల పరిస్థితి విషమించిందని చెబుతున్నారు. వెంటనే ఫాగింగ్, యాంటీ లార్వల్ చర్యలు చేపట్టి ప్రజలను వ్యాధుల నుంచి రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

February 25, 2026 / 04:43 PM IST

రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

JGL: రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ధర్మకర్తలు చెన్నమనేని విష్ణువర్ధన్, వంశీవర్ధన్ ఆధ్వర్యంలో ఉత్సవాలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అర్చకులు రామకృష్ణాచార్యులు తెలిపారు. ఈనెల 26- మార్చి 5వ తేదీ వరకు ఈ వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.

February 25, 2026 / 04:40 PM IST

క్రీడల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు: మంత్రి

NRPT: యువజన సర్వీసులు, క్రీడల శాఖలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులపై బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులతో మంత్రి వాకిటి శ్రీహరి సమీక్ష నిర్వహించారు. తెలంగాణను క్రీడారంగాన్ని అగ్రగామి నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.

February 25, 2026 / 04:39 PM IST

పర్యాటక ప్రాంతంగా తీగలనాగరం చెరువు

SRD: పటాన్చెరు మండలం బీరంగూడ డివిజన్ పటేల్ గూడ పరిధిలోని తీగలనాగరం చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దెందుకు కృషి చేస్తున్నామని పటాన్చెరు MLA గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం చెరువు పరిధిలో కోటి 35 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఫెన్సింగ్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామన్నారు.

February 25, 2026 / 04:37 PM IST