• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘మట్టి పరీక్షలపై మోడల్ స్కూల్ విద్యార్థులకు అవగాహన’

MHBD: భూసార మట్టి పరీక్షలపై నెల్లికుదురు మోడల్ స్కూల్‌లోని 8, 9 తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. పంటల దిగుబడి పెంపుతో పాటు నేల ఆరోగ్యం పరిరక్షణకు మట్టి పరీక్షలు ఎంతో కీలకమన్నారు. సరైన విధానంలో మట్టి నమూనాలు సేకరించి, పరీక్షలు చేయడం ద్వారా రైతులు అవసరమైన ఎరువులను వాడవచ్చని తెలిపారు.

February 25, 2026 / 07:23 AM IST

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి: MLA

BHPL: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఎలాంటి రాజీ లేకుండా ఉక్కుపాదం మోపాలని MLA గండ్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం IDOC కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, TGMDC, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు రెవెన్యూ, పోలీస్, TGMDC శాఖలతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి పటిష్ట పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

February 25, 2026 / 07:17 AM IST

‘ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి’

SRPT: సూర్యాపేట జిల్లాలో ఉగాది నాటికి ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసి లబ్దిదారులతో గృహ ప్రవేశాలు నిర్వహించాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ అన్నారు. మంగళవారం సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్లపై జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

February 25, 2026 / 07:16 AM IST

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: MP నగేశ్

ADB: ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేశ్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు నిన్న పట్టణంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలు, పలు అంశాలపై ఎంపీతో చర్చించగా సానుకూలంగా స్పందించినట్లు సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో TGO జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి, జిల్లా కార్యదర్శి రమణాచారి, తదితరులు ఉన్నారు.

February 25, 2026 / 07:16 AM IST

‘విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలి’

ASF: ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని ITDA ప్రాజెక్టు అధికారి యువరాజ్ మార్మాట్ ఉపాధ్యా యులను ఆదేశించారు. ఆసిఫాబాద్ బాలికల ఆశ్రమ పాఠశాల, సిర్పూర్ ఈఎంఆర్ఎస్, కాగజ్ నగర్ బాలుర పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించాలని, విద్యార్థులకు మెరుగైన భోజనం, వైద్యం అందించాలని సూచించారు.

February 25, 2026 / 07:15 AM IST

‘రైతుల కోసం నాణ్యమైన విద్యుత్ సరఫరా’

MNCL: పంటలు పండిస్తున్న రైతుల కోసం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని TGNPDCL మంచిర్యాల SE రాజన్న వెల్లడించారు. రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా TGNPDCL పని చేస్తుందన్నారు. మంచిర్యాల పరిధిలో డిసెంబర్ నెల నుంచి ఇప్పటి వరకు 429 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

February 25, 2026 / 07:14 AM IST

ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు: ఎస్పీ

SRD: జిల్లాలో ఇంటర్ పరీక్షల సందర్భంగా కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని ఆదేశించారు. చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరూ సెల్ఫోన్లను అనుమతించవద్దని సూచించారు. ప్రతి కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

February 25, 2026 / 07:13 AM IST

“మత్తు వదలండి – మైదానానికి రండి: MLA నాగరాజు

WGL: వర్ధన్నపేట పట్టణంలోని అల్ఫోర్స్ పాఠశాల వార్షికోత్సవం కార్యక్రమం మంగళవారం సాయంత్రం పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా MLA KR నాగరాజు హాజరై, మాట్లాడారు. “మత్తు వదలండి – మైదానానికి రండి.. మత్తు వదలండి – చదువుతో సత్తా చాటండి” అనే నినాదం రేపటి తరానికి ప్రాణవాయువు కావాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

February 25, 2026 / 07:11 AM IST

జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

NZB: తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ సంఘం ఆదేశాల మేరకు జిల్లా సైక్లింగ్ సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా అడ్వకేట్ శరత్ చంద్ర బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఎన్నికల్లో కృపాకర్ రెడ్డి జిల్లా సైక్లింగ్ సంఘం అధ్యక్షుడిగా, భూలోక విజయకాంత్ రావు ప్రధాన కార్యదర్శిగా, సురేందర్ కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

February 25, 2026 / 07:10 AM IST

దేవాదుల పథకానికి రూ.1,332 కోట్ల విద్యుత్ బకాయిలు

MLG: దేవాదుల ఎత్తిపోతల పథకంకు సంబంధించిన విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.1,332 కోట్లకు చేరాయి. వేసవి ప్రారంభంతో గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసేందుకు మోటార్లు నిరంతరం నడవాల్సి ఉండటంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. రోజుకు 20మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుండగా, రోజుకు దాదాపు రూ.1కోటి, నెలకు రూ.30 కోట్ల వరకు ఖర్చవుతున్నట్లు అంచనా.

February 25, 2026 / 07:04 AM IST

ఆసుపత్రులకు నోటీసులు జారీ: కలెక్టర్

KMR: కామారెడ్డి జిల్లాలో అనుమతి లేకుండా ఎటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్లు నిర్వహించకూడదని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన DRA కమిటీ సమావేశం జరిగింది. DM&HO రవీందర్ గౌడ్ సమావేశంలో నివేదిక సమర్పించారు. సరైన పత్రాలు సమర్పించని 11 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

February 25, 2026 / 07:04 AM IST

NIMS ఆసుపత్రిలో CMRF ద్వారా రూ.521 కోట్లు

HYD: పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో సీఎంఆర్ ఫండ్ ద్వారా అనేక మందికి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని డైరెక్టర్ బీరప్ప తెలిపారు. గత రెండు సంవత్సరాల్లో ఎల్‌ఓసీల ద్వారా రూ. 521 కోట్లకు పైగా విలువైన చికిత్సలు అందించినట్లు వెల్లడించారు. వెన్నెముక శస్త్రచికిత్సలు సైతం నిర్వహించామని, ముఖ్యంగా న్యూరో సర్జరీ కేసులు 2,221 నమోదైనట్లు పేర్కొన్నారు.

February 25, 2026 / 07:03 AM IST

నేడు జిల్లాకు రానున్న కేటీఆర్

NGKL: కుమ్మెర కులోన్మాద ఘటనలో 8 మంది నిందితుల్లో ముగ్గురినే అరెస్ట్ చేశారని, మిగతా వారిని కూడా అరెస్ట్ చేయాలని BRS నేతలు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈరోజు మ.12 గంటలకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR నాగర్‌ కర్నూల్‌‌కు రానున్నారు. భారీగా పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాల నేతలు తరలిరావాలని పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

February 25, 2026 / 07:03 AM IST

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ

NRPT: జిల్లా వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద వంద మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 15 పరీక్ష కేంద్రాలు ఉన్నాయని, పరీక్షలు జరిగే ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జిరాక్స్ సెంటర్లు ముసి ఉంచాలని చెప్పారు.

February 25, 2026 / 07:03 AM IST

మార్చి 10 వరకు పది విద్యార్థులకు అల్పాహారం

MDCL: మేడ్చల్- మల్కాజ్‌గిరి జిల్లా వ్యాప్తంగా 108 ప్రభుత్వ పాఠశాలల్లో మార్చి 10వ తేదీ వరకు అల్పాహార కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా DEO విజయకుమారీ తెలిపారు. ప్రతి విద్యార్థిపై రోజుకు రూ.15 చొప్పున వెచ్చించి పోషకాహారం అందిస్తున్నారు. 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఇది శక్తినిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు.

February 25, 2026 / 07:00 AM IST