• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

WGL: జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిన్న సాయంత్రం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. వేసవికాలం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి100, నుంచి 150 లీ, మంచినీరు సరఫరా చేయాలని అధికారులకు ఆదేశించారు.

February 22, 2026 / 08:41 AM IST

గాంధీ ఇంఛార్జ్ సూపరింటెండెంట్‌గా ప్రొఫెసర్ మురళీధర్

HYD: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి ఇంఛార్జ్ సూపరింటెండెంట్‌గా అనస్తీషియా విభాగాధిపతి ప్రొ.ఆవుల మురళీధర్‌ను వైద్య ఉన్నతాధికారులు నియమించారు. సూపరింటెండెంట్ ప్రొ.వాణి విదేశాలకు వెళ్లడంతో ఆమె తిరిగివచ్చే వరకు ఆయన బాధ్యతలు నిర్వహిస్తారు. గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎండీ పూర్తి చేశారు.

February 22, 2026 / 08:37 AM IST

ఢిల్లీకి బయలుదేరిన OC JAC నాయకులు.

WGL: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నేడు నిర్వహించనున్న ఆర్యవైశ్య మహాసభలో పాల్గొనడానికి వరంగల్ నుంచి GT ఎక్స్‌ప్రెస్ రైల్లో ఢిల్లీకి ఆర్యవైశ్య సంఘ నాయకులు బయలుదేరారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఆర్యవైశ్యులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య జిల్లా గౌరవ అధ్యక్షుడు గంద శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల హక్కులు కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

February 22, 2026 / 08:37 AM IST

యాప్ ద్వారా 2.18 లక్షల బస్తాల యూరియా పంపిణీ

NGKL: జిల్లాలో యూరియా యాప్ ద్వారా 46,529 మంది రైతులకు 2.18 లక్షల యూరియా బస్తాల పంపిణీ చేశామని జిల్లా కలెక్టర్ సంతోష్ శనివారం పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్లు లేని రైతులు మండల వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా యూరియాను బుక్ చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో 24 యూరియా బస్తాల నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు.

February 22, 2026 / 08:31 AM IST

నార్నూర్‌లో అక్రమ మట్టి రవాణా

ADB: నార్నూర్‌లో ప్రభుత్వ భూమిని అక్రమంగా తవ్వి మట్టిని తరలిస్తున్న ఉదంతం కలకలం రేపింది. ఓ పెట్రోల్ బంక్ నిర్మాణానికి అవసరమైన మట్టిని అధికారులు అనుమతి లేకుండానే కాంట్రాక్టర్ రాత్రుళ్లు తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజా ఆస్తిని దోచుకుంటూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

February 22, 2026 / 08:30 AM IST

ఎస్ఐఆర్ పకడ్బందీగా చేపట్టండి: కలెక్టర్

NRPT: ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శనివారం ఊట్కూర్ తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. మండలంలో ఎన్నికల ప్రాజెనీ మ్యాపింగ్ తహసీల్దార్ రవి, బూత్ లెవెల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

February 22, 2026 / 08:29 AM IST

రూ.151కే ఇంటికి భద్రాచల రాములోరి కళ్యాణ తలంబ్రాలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త. భద్రాచల సీతారామయ్య కళ్యాణ తలంబ్రాలను రూ.151లకే అందించనున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. హైదరాబాద్ బస్ భవన్‌లో శనివారం పోస్టర్ ఆవిష్కరించారు. తెలంగాణకు చెందినవారు ఈ నెల 23వ తేదీన www.tgartclogistics.co.inలో రిజిస్టర్ చేసుకోవాలని, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అనంతరం తలంబ్రాలు అందజేస్తామని ఆయన వివరించారు.

February 22, 2026 / 08:27 AM IST

బావిలో పడి వ్యక్తి మృతి

BHPL: చిట్యాల మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఏకు సారయ్య (55) రేగొండ మండలం కొడవటంచలోని వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. ప్రతి వారం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే సారయ్య, ఈ నెల 17న ఆలయానికి వచ్చి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. బావిలో దుర్వాసన రావడంతో పరిశీలించగా మృతదేహం లభ్యమయింది.

February 22, 2026 / 08:25 AM IST

అటవీ ప్రాంతాల్లో అర్థరాత్రి తవ్వకాలు…!

MHBD: గూడూరు మండలం అటవీ ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తులు జేసీబీ సహాయంతో శనివారం అర్థరాత్రి తవ్వకాలు చేశారు. సీతానగరం గ్రామ యువకులు ఆ వ్యక్తులను ఆరా తీశారు. వారు పోంతనలేని సమాధానం ఇచ్చారు. దీంతో యువకులు అటవీశాఖ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు వచ్చేలోపో వారు అక్కడి నుంచి పరారయ్యారు. గుప్త నిధుల కోసమే తవ్వకాలు చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

February 22, 2026 / 08:24 AM IST

‘మండల స్థాయిలో ప్రజావాణి పునః ప్రారంభం’

MDK: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 23 నుంచి మండల స్థాయిలో ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో నిర్వహించబడుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదే రోజు కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారని, మార్చి 2 నుంచి ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు.

February 22, 2026 / 08:23 AM IST

నేడు నారాయణ గూడెం మందకృష్ణ రాక..!

SRPT: మునగాల మండలం నారాయణ గూడెంలో దళితులపై జరిగిన దాడిని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నేడు పర్యటించనున్నారు. పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామంలో అగ్రవర్ణాల వ్యక్తులు దళితులపై దాడి చేసినా, పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని బాధ్యత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించనున్నట్లు సమాచారం.

February 22, 2026 / 08:21 AM IST

మెదక్ జిల్లాలో నేటి చికెన్ ధరలు ఇవే

మెదక్ జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ.206 నుంచి రూ.230 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ.234 నుంచి రూ.260 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 5 వరకు తగ్గింది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చుని వ్యాపారులు తెలిపారు.

February 22, 2026 / 08:18 AM IST

జిల్లాలో నేటి చికెన్ ధరలు ఇవే..!

మహబూబ్ నగర్ జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ.206 నుంచి రూ.230 మధ్య ఉండగా, స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ.234 నుంచి రూ.260 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ.5 వరకు తగ్గింది. అయితే, ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని వ్యాపారస్థులు తెలిపారు.

February 22, 2026 / 08:15 AM IST

‘ప్రజలకు ఉచిత న్యాయ సహాయం’

PDPL: గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే లక్ష్యమని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి గణేష్ తెలిపారు. నిన్న సుల్తానాబాద్ మండలం గట్టేపల్లిలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అవగాహనతోనే న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

February 22, 2026 / 08:14 AM IST

తెలంగాణ గ్రామీణ బ్యాంకును సందర్శించిన విద్యార్థులు

KNR: స్థానిక బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థులు శనివారం తెలంగాణ గ్రామీణ బ్యాంకును సందర్శించారు. హెచ్ఎం జలీల్, ఉపాధ్యాయులు కుమార్, పుష్పలత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ అనిల్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఖాతాల రకాలు, డిపాజిట్లు, వడ్డీ రేట్లు, రుణాల ప్రక్రియ గురించి వివరించారు.

February 22, 2026 / 08:11 AM IST