తెలుగు రాష్ట్రాలో బీజేపీ సినీ రాజకీయం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మొన్నటి మొన్న టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ని.. అమిత్ షా వచ్చి కలిశారు. ఇలా కలవడం రాజకీయంగా తీవ్ర దుమారమే రేపింది. ఆ తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తోనే జేపీ నడ్డా.. హీరో నితిన్ ని కలిశాడు. ఇదేంటి.. బీజేపీ నేతలంతా సినిమా తారలపై పడ్డారు అని అందరూ అనుకున్నారు. ఎన్టీఆర్ ఆల్రెడీ పొలిటికల్ ఫ్యామిలీతో కనెక్షన్ ఉంది కాబట్టి.. కలిశాడంటే ఒకే.. మరి నితిన్ ని ఎందుకు కలిశారు..? ఆయన కూడా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారా..? ఇలా చాలానే చర్చ జరిగింది.
కానీ.. తాజాగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి బీజేపీ పార్టీ కలుద్దామనుకుంది నిఖిల్ ట. కానీ పేర్లు పొరపడి నితిన్ సీన్ లోకి వచ్చాడట. నిఖిల్ రీసెంట్ గా కార్తికేయ 2 తో సూపర్ హిట్ కొట్టడం వార్తల్లో నిలిచింది. ఈ నేపధ్యంలో నిఖిల్ తో బిజేపీ భేటీ అవ్వావని ప్లాన్ చేసి పై నుంచి ఆ పేరు పంపారట. అయితే చిన్న పొరపాటుతో నిఖిల్ కాస్తా నితిన్ అయ్యిందని చెప్పుకుంటున్నారు.
మరో ప్రక్క నిఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ కార్తికేయ-2 టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఎన్నో కష్టాలు.. అనేక వాయిదాల తరువాత ఆగస్టు 13న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీసు వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. 2014లో విడుదలైన కార్తికేయ మూవీకి ఇది సీక్వెల్. డైరెక్టర్ చందు మొండేటి పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.