WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్లో బుధవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.7,515 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.21, 500 ధర పలకగా… వండర్ హాట్(WH) మిర్చి రూ.37 వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.18,400, ఎల్లో మిర్చి రూ. 24వేలు పలికాయి. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
SRPT: నడిగూడెం క్లస్టర్ పరిధిలోని రైతులు ఈ నెల 28లోపు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని ఏఈవో పిచ్చయ్య కోరారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడానికి ఈ నమోదు అవసరమని, రైతులు వెంటనే మీసేవ లేదా రైతు వేదికలో సంప్రదించాలని సూచించారు. నమోదు చేసుకోని పక్షంలో ప్రభుత్వ సాయం పొందే అవకాశం కోల్పోతారని ఆయన హెచ్చరించారు.
NZB: ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల భీంగల్ మండలం పల్లికొండకు చెందిన గంగం అజయ్ మృతి చెందాడు. చెవి నొప్పితో వచ్చిన అజయ్‌కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేస్తుండగా పరిస్థితి విషమించింది. మత్తు మందు వికటించడం వల్లే అజయ్ చనిపోయాడని, ఆసుపత్రిలో సరైన సౌకర్యం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట శవంతో బుధవారం ధర్నాకు దిగారు.
WNP: ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగుతున్నట్లు చీఫ్ సూపర్డెంట్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం తెలిపారు. తొలి రోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు మొత్తం 385 మంది విద్యార్థులకు ఘనం 370 మంది హాజరైనట్లు తెలిపారు. మిగతా 15 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు. జిల్లాలో అన్ని పరీక్ష కేంద్రాలు నిబంధనల ప్రకారం కొనసాగుతున్నాయి అన్నారు.
KMR: కామారెడ్డి జిల్లాలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పర్య వేక్షణ, ప్రశ్నాపత్రాల భద్రతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
BHPL: జిల్లాలో మొదటి రోజు ఇంటర్ ఫస్టియర్ వార్షిక పరీక్షలు విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 1,829 మంది విద్యార్థులకు గాను 1,772 మంది పరీక్షలు రాసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకన్న తెలిపారు. 96.88% హాజరు శాతం నమోదైనట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు
GDWL: అయిజ పట్టణంలోని 1వ వార్డులో బుధవారం డ్రైనేజీల ప్రక్షాళన, పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ చిన్న సురేశ్ ఆదేశాల మేరకు కౌన్సిలర్ తిరుమలేశ్, బీఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది వార్డులో నిలిచిపోయిన మురుగు నీటిని తొలగించి, బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.
MDK: బాలలందరికీ న్యాయం, బాలల ఉజ్వల భవిష్యత్తు కోసం బడిలో చేర్పిద్దామని చేగుంట తహసీల్దార్ శివప్రసాద్ పేర్కొన్నారు. విజన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రచార రథం ప్రారంభించారు. 2001లో స్థాపించబడి రెండు దశాబ్దాల పైబడి రాష్ట్రంలో అనేక జిల్లాల యందు బాలబాలికలు, స్త్రీలపై జరిగే హింసకు వ్యతిరేకంగా పనిచేస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు.
SDPT: హుస్నాబాద్ పట్టణంలోని ఇంటర్మీడియట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు, ప్రోత్సహించేందుకు హుస్నాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ దండి లక్ష్మి కొమురయ్య ఉచితంగా పెన్నులు అందించారు. సమయాన్ని వృథా చేయకుండా, ఏకాగ్రతతో చదివి, మంచి ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు.
KMM: ఏదులాపురం మున్సిపాలిటీలోని వెంకటగిరిలో శ్రీ గోవింద మాంబ సమేత జగద్గురు మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి శిఖర కలశ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ళ, భక్తులు పాల్గొన్నారు.
SDPT: అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరిపల్లిలో లీడ్ బ్యాంకు సహకారంతో సైబర్ మోసాలు, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌పై అవగాహన నిర్వహించారు. సర్పంచ్ నాగరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో TGB చిట్టాపూర్ బ్యాంకు మేనేజర్ అభినయ్ రెడ్డి మాట్లాడుతూ.. PMSBY, PMJJBY లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
BDK: మణుగూరు మండలం సమితి సింగారం కోడిపుంజుల వాగు వ్యవసాయ క్షేత్రంలో రైతుల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లను గుర్తు తెలియని దుండగులు మంగళవారం రాత్రి అపహరించుకుపోయారు. బుధవారం ఉదయం రైతులు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లగా ఈ ఘటనను చూసి షాక్ అయ్యారు. పోలీసులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఇలాంటి దొంగతనాలు జరగకుండా చర్యలు చేపట్టాలని రైతులు కోరారు.
NLG: నల్గొండ పట్టణం, పానగల్ పీఏసీఎస్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సయ్యద్ హాషాం మాట్లాడుతూ.. యూరియా యాప్‌ను రద్దు చేసి రైతుల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు. సాగుకు అత్యవసరమైన సమయంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నాయకులు, రైతులు పాల్గొన్నారు.
SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాచర్ల గొల్లపల్లికి చెందిన పిట్ల శరణ్య రాచర్ల కళాశాలలో ఇంటర్ చదువుతోంది. పరీక్షా కేంద్రానికి ఉ.9:20కి ఆమె చేరుకోవడంతో ఉపాధ్యాయులు పరీక్ష కేంద్రానికి అనుమతించలేదు. దీంతో విద్యార్థిని రోదిస్తూ గేటు వద్ద ఉండిపోయింది. తన తమ్ముడిని స్కూలుకు పంపించి వచ్చేసరికి ఆలస్యమైందని శరణ్య ఆవేదన వ్యక్తం చేసింది.
SRPT: నడిగూడెం మండలం సిరిపురం రైతు వేదిక క్లస్టర్ పరిధిలోని వివిధ గ్రామాల రైతులందరూ, ఈనెల 28 లోపు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని ఏఈవో రేణుక బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ పథకాలు లబ్ధి పొందేందుకు ఈ నమోదు అవసరమని తెలిపారు. రైతులందరూ 28 లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు.