• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘జయంతికి రావాలని ఎంపీకి ఆహ్వానం’

ADB: ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేశ్‌ను ప్రధాన్ పురోహిత్ జిల్లా సంఘం నాయకులు పట్టణంలోని ఎంపీ నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మార్చి 15న రామ్ లీలా మైదానంలో నిర్వహించనున్న హీరా సుఖ జయంతి కార్యక్రమం గోడ ప్రతులను ఎంపీ నగేశ్‌తో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమానికి రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు.

February 25, 2026 / 03:00 PM IST

ప్రభుత్వ డిగ్రీ కళాశాల బలోపేతానికి అధిక నిధులు: MLA

MHBD: ప్రభుత్వ డిగ్రీ కళాశాల బలోపేతానికి అధిక నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. తొర్రూరు డిగ్రీ కళాశాలలో మార్చి 13వ తేదీన జరిగే జాతీయ సెమినార్‌కు హాజరుకావాలని ఎమ్మెల్యేకు కళాశాల ప్రిన్సిపల్ ఆహ్వానం అందజేశారు. అనంతరం అడ్మిషన్ కరపత్రాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

February 25, 2026 / 02:59 PM IST

పరీక్షా కేంద్రాన్ని పరిషలించిన ఆర్డీవో

MDK: టేక్మాల్ గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆర్డీవో రమాదేవి మండల అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాలలోని వసతులను కళాశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని వారికి సూచించారు. వీరిలో తహశీల్దార్ తులసిరామ్, కళాశాల సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

February 25, 2026 / 02:59 PM IST

మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరం: సీఐ

MBNR: మద్యం సేవించి వాహనాలు నడిపితే జీవితాలు రోడ్డుపాలవుతాయని మహబూబ్‌నగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ రెడ్డి అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి సీఐ బుధవారం పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల డ్రైవర్ నిర్ణయ సామర్థ్యం తగ్గి ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు.

February 25, 2026 / 02:56 PM IST

కౌడిపల్లిలో యాక్సిడెంట్..!

MDK: కౌడిపల్లి నుంచి మెదక్ వెళ్తున్న ద్విచక్ర వాహనానికి లోతు వాగు వద్ద కుక్క అడ్డురావడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వాహనం అదుపుతప్పి కిందపడటంతో దేవులపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. బాధితుడిని చికిత్స నిమిత్తం మెదక్ ఆసుపత్రికి తరలించారు.

February 25, 2026 / 02:49 PM IST

పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

NLG: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ఇవాళ కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ సందర్శించారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య, అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రశ్న పత్రాలు, జవాబు పత్రాలను భద్రత గురించి అడిగి తెలుసుకున్నారు. కాపీ కి అవకాశం లేకుండా చూడాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు.

February 25, 2026 / 02:46 PM IST

బాధితుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన సర్పంచ్

MHBD: నెల్లికుదురు మండలంలోని సౌల్ల తండా గ్రామ పంచాయతీకి చెందిన భూక్యా సోమ్లాకు వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ ఆదేశాల మేరకు ఇవాళ సర్పంచ్ గుగులోత్ సుజాత వాసు చేతుల మీదుగా బాధితుడికి అందజేశారు. సీఎంఆర్ఎఫ్ పథకం ప్రతి పేద వారికి ఒక వరం అని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 25, 2026 / 02:45 PM IST

అసంపూర్తిగా దర్శనమిస్తున్న మరుగుదొడ్లు

BHPL: కాటారం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణ పనులు రెండేళ్లు గడుస్తున్నా పూర్తికాకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రతాపగిరి పాఠశాలలో బాలుర మరుగుదొడ్ల పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో విద్యార్థులు బహిర్భూమికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా అధికారుల స్పందించాలన్నారు.

February 25, 2026 / 02:44 PM IST

కంగ్టి ఎంపీడీవోకు ప్రమోషన్… సీఈఓ అభినందన

SRD: కంగ్టి మండల అభివృద్ధి అధికారి సత్తయ్యకు పదోన్నతి లభించింది. గత రెండేళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్న ఈయనకు డిప్యూటీ సీఈఓగా ప్రమోషన్ కల్పిస్తూ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఇవాళ సంగారెడ్డిలో సీఈవో జానకి రెడ్డితో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈయనకు పదోన్నతికి CEO అభినందనలతో శుభాకాంక్షలు తెలిపారు.

February 25, 2026 / 02:42 PM IST

నర్సంపేటలో పురాతన బావికి ఎట్టకేలకు మోక్షం

WGL: నర్సంపేట పట్టణంలోని వల్లభునగర్ కాలనీలో ఏళ్ల తరబడి నిరుపయోగంగా, చెత్తతో నిండి ఉన్న పురాతన బావికి ఎట్టకేలకు మోక్షం లభించింది. బావి దుస్థితి మున్సిపల్ ఛైర్మన్ శ్రీలక్ష్మీ రామానంద్ దృష్టికి రాగానే ఆమె వెంటనే స్పందించారు. బావిని పూర్తిగా శుభ్రం చేయించి, అందులోకి చెత్తాచెదారం పడకుండా పటిష్ఠమైన జాలిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

February 25, 2026 / 02:41 PM IST

బిర్యానీ ఆకు లేకుండా ఎలా వండారు: కలెక్టర్ ఆగ్రహం

సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నం, గుడ్డు కర్రీ, ఆలుగడ్డ, టమాట కర్రీలను పరిశీలించారు. బిర్యానీ అన్నం నాణ్యత సరిగా లేదని బిర్యానీలో బిర్యానీ ఆకు లేకుండా ఎలా వండారని వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

February 25, 2026 / 02:40 PM IST

విద్యార్థులకు చెస్ బోర్డులు పంపిణీ చేసిన MEO

WGL: వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బుధవారం చెస్ నెట్‌వర్క గ్లోబల్ ఆధ్వర్యంలో MEO మామునూరు శ్రీధర్ విద్యార్థులకు 126 చెస్ బోర్డులు, కాయిన్లు ట్రైనింగ్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MEO మాట్లాడుతూ.. దాతల సహకారం మరువలేనిదని, విద్యార్థుల్లో చెస్ ఆట పట్ల ఆసక్తి పెరిగి తర్కశక్తి, ఏకాగ్రత అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.

February 25, 2026 / 02:39 PM IST

నిందితులను కఠినంగా శిక్షించాలని ప్లకార్డుల ప్రదర్శన

HYD: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలోని మల్లన్న జాతరలో రెండు నెలల చిన్నారి మృతి బాధాకరం అని ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి మృతి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి ఆర్ట్స్ కళాశాల ప్రధాన రహదారి వరకు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

February 25, 2026 / 02:38 PM IST

రేషన్ కార్డుల అందజేత

NZB: డిచ్‌పల్లి మండలం కమలాపూర్లో సర్పంచ్ ఋత్విజా రత్నం నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు బుధవారం అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అందేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కర్నోల్ల సుజాత భూపతి, పంచాయతీ సిబ్బంది కొప్పెర రాకేశ్, సిర్నాపల్లి గంగాధర్, గంగారాం, బక్కన్న తదితరులు పాల్గొన్నారు.

February 25, 2026 / 02:38 PM IST

మున్సిపల్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరణ

RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మున్సిపల్ ఛైర్మన్‌గా సాత ప్రవీణ్ కుమార్, వైస్ ఛైర్ పర్సన్‌గా జూలకంటి శ్వేతా పాండురంగరెడ్డి మునిసిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మునిసిపల్ అభిరుద్దికి తమ సహకారం అందచేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

February 25, 2026 / 02:35 PM IST