టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రశాంత్ నేడు కరీంనగర్ జైలు నుండి విడుదలైయ్యారు. తర్వాత మీడియా(Media)తో మాట్లాడారు. తనపై పోలీసులు(Police) ఉద్దేశ్యపూర్వకంగానే కేసు నమోదు చేశారని ప్రశాంత్(Prashanth) ఆరోపించారు.
తెలంగాణ (Telangana) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పని చేసే కాంట్రాక్ట్ లెక్చరర్ల (Contract Lecturers) పదవీ విరమణ వయస్సు తగ్గింది.ఇప్పటి వరుకు రిటైర్మెంట్ వయస్సు (Retirement age) 61 ఏళ్లు ఉండగా ..దాన్ని 58 ఏళ్లుకు తగ్గించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్టు కమిషనర్ నవీన్ మిట్టల్(Naveen Mittal) ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ(Telangana) లో ఎండలు మండిపోతున్నాయ్. రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత (Sun intensity) మరింత పెరిగింది. సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రత (temperature) గురువారం నమోదైంది. రాష్ట్రంలో సూర్యడి దెబ్బకు అందరు బయట తిరగడమే మానేశారు. తెలంగాణవ్యాప్తంగా 40 డిగ్రీల సెల్సియస్‌పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
టెన్త్ మెయిన్ సబ్జెక్టుల ఎగ్జామ్స్ పూర్తికావడంతో గురువారం నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. మొత్తం 18 సెంటర్లలో 21వ తేదీ వరకు వాల్యుయేషన్ కొనసాగనున్నట్లు వెల్లడించారు.
బంతి బంతికీ, ప్రతి ఓవర్ కు.. ఇలా రకరకాలుగా బెట్టింగ్ లు చేస్తున్నారు. పంటర్లు నిర్వాహకులు ముందుగా చెప్పిన బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపాలి. గెలిచినా.. ఓడినా.. తెరపై కనిపించేలా ఏర్పాట్లు చేశారు.
ఈ రోజు తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు(Iftar Dawat) నిర్వహించాలని సీఎం కేసీఆర్(CM KCR) నిర్ణయించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం(LB Stadium)లో ఘనంగా ముస్లిములకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ముస్లిములు పవిత్ర మాసంగా ఆచరించే రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రతిఏటా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది.
ఏపీలో రోడ్లు, ఆస్పత్రులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో తెలంగాణకు ఏపీకి చాలా వ్యత్యాసం ఉంది. మరి ఇక్కడ ఉంటారా? అక్కడ ఉంటారా? మీకు ఇక్కడే మంచిగా ఉంది కాదా?’
మిసె ఇండియా(Ms. India) కిరీటాన్ని తెలంగాణకు చెందిన అమ్మాయి అంకిత ఠాకూర్(Ankita Thakur) సొంతం చేసుకుంది. మంగళవారం సాయంత్రం కొచ్చి(Kochi) లోని లీ మెరెడియల్ హోటల్‌లో ఫైనల్స్ జరిగాయి. 14 రాష్ర్టాల నుంచి అమ్మాయిలు ఈ పోటీలో పాల్గొన్నారు. వీరందరినీ వెనక్కి నెట్టేసి తెలుగు యువతి మిస్ ఇండియా కిరీటం గెలుచుకొని.. రికార్డు సృష్టించింది.
కనీసం మరుగుదొడ్లు సక్రమంగా లేవు. ప్రేక్షకులు కూర్చోవడానికి కుర్చీలు విరిగిపోయి ఉంటాయి. స్టేడియం అంతా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. అయినా కూడా అందులోనే మ్యాచ్ లు జరుగుతున్నాయి.
బలగం సినిమా పైన కొందరు ఎంపీటీసీలు పోలీసులకు ఫిర్యాదు చేయడం తాజాగా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా తీసిన దర్శకుడు వేణు యెల్దండి పైన ఓ వైపు ప్రశంసల వర్షం కురుస్తుంటే కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తనపై ఆరోపణలు చేసిన బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ కి వరంగల్ సీపీ రంగనాథ్ కౌంటర్ ఇచ్చారు.
TSPSC పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసు(TSPSC paper leak case)ను విచారిస్తున్న హైదరాబాద్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మంగళవారం దర్యాప్తు రిపోర్టును హైకోర్టు(telangana High Court)కు సమర్పించింది. ఈ క్రమంలో ఓ పిటిషనర్ ఈ కేసును సీబీఐ(CBI)కి అప్పగించాలని దాఖలు చేసిన అంశంపై విచారణ జరిపి కేసును ఈనెల 24కు వాయిదా వేసింది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం వాట్సాప్ ద్వారా బయటకు వచ్చిన కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ వచ్చింది.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తాను.. తెలంగాణ ఉద్యమకారులపై కేసులు పెట్టిన వ్యక్తి వద్దకు వెళ్లి పార్టీ సభ్యత్వం తీసుకోవాలా అని ప్రశ్నించారు జూపల్లి.
కోవర్టుల వల్ల కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందన్నారు పాల్వాయి స్రవంతి.