తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడీ అప్పుడే మొదలైంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ… ఇప్పటి నుంచే పొత్తుల వ్యవహారాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రానప్పటికీ.. పొత్తు కన్ఫామ్ అనే అంటున్నారు. ఇదే పొత్తు తెలంగాణలోనూ కొనసాగే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో… తెలంగాణ బీజేపీ నేత లక్ష్మణ్ స్పందంచారు.
తెలంగాణలో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన ప్రకటించారు. గురువారం నాడు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. టీడీనీతో కలిసి పోటీ చేసే ఆలోచన లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీతో కలిసి పోటీ చేస్తామని డాక్టర్ లక్ష్మణ్ ప్రకటించారు.
2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ ఎన్డీఏ నుండి బయటకు వచ్చింది. 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. ఏపీలో వైసీపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లారు.ఈ సమయంలో ప్రధాని మోడీతో టీడీపీ చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత బీజేపీకి టీడీపీ దగ్గర అవుతుందనే ప్రచారం కూడ లేకపోలేదు. ఎన్డీఏలోకి తిరిగి టీడీపీ వచ్చే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ విషయ,మై ఇవాళ డాక్టర్ లక్ష్మణ్ స్పష్టత ఇచ్చారు. టీడీపీతో కలిసి పోటీ చేయబోమని చెప్పారు.