హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇకపై రాత్రి 11 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 10 నుంచి ఈ సేవలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం మెట్రో సేవలు రాత్రి 10.15 గంటల వరకు కొనసాగుతుండగా..వీటిని 11 గంటల వరకు పొడిగించారు. ఈ నిర్ణయం పట్ల ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొత్తగా హైదరాబాద్ మెట్రోలో జర్నే చేసేందుకు వా...
తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్…భారీగా రుణం తీసుకుని చెల్లించడం లేదని బ్యాంకులు చెబుతున్నాయి. 2014 నుంచి 2022 వరకు 33,787.26 కోట్ల రూపాయల రుణం చెల్లించాలని బ్యాంకులు వెల్లడించాయి. ధాన్యం కొనుగోళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వ గ్యారంటీతో ఈ కార్పొరేషన్ అప్పులు తీసుకుని చెల్లించడం లేదని తెలిపాయి. ప్రతి ఏటా కోట్ల రూపాయలు అప్పులుగా తీసుకుని ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పాయి. మరోవైపు పీ...
తెలంగాణలో మళ్లీ ఎన్నికల జోరు మొదలైంది. ఈరోజు నుంచి మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 14 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా…అక్టోబర్ 17న నామినేషన్ల ఉపసంహరణ చేయనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రిటర్నింగ్ అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథ రావును నియమించారు. నామినేషన్ల ప్రక్రియ విధానాన్ని వీడియో రికార్డు చేయనున్నారు. ఈ క్రమం...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి బీజేపీ నేత లక్ష్మణ్ సవాలు విసిరారు. కేసీఆర్ కి దమ్ముంటే… మనుగోడు ఎన్నికల్లో గెలిచి చూపించాలంటూ సవాలు విసరడం గమనార్హం. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ప్రజలు బుద్ది చూపిస్తారని ఆయన అన్నారు. ఉద్యమకారులను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానం లభించలేదన్నారు.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలను మోసం చేశాయని ఆ...
మునుగోడు ఉప ఎన్నికకు తేదీ ఖరారు అయ్యింది. వచ్చే నెలలో ఈ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. కానీ అధికార పార్టీ మాత్రం అభ్యర్థిని ఖరారు చేయలేదని అందరూ అనుకున్నారు. కాగా.. తాజాగా ఆయన తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని పార్టీ అధినేత సీఎం కెసిఆర్ మునుగోడు అభ్యర్ధిగా ప్రకటించారు.స్థానిక నాయ...
మద్యం ప్రియులు మరోసారి రికార్డు బ్రేక్ చేశారు. మామూలు రోజుల్లోనే మద్యం విపరీతంగా అమ్ముడుపోతూ ఉంటుంది. అలాంటిది పండగ వస్తే.. మరింత అమ్ముడిపోవాల్సిందే. ముఖ్యంగా తెలంగాణలో దసరా పండగకు మద్యం ఏరులై పారాల్సిందే. ఈ ఏడాది దసరా కి కూడా అదే జరిగింది. రికార్డుస్థాయిలో అమ్మకాలు సాగాయి. తెలంగాణలో అత్యంత ఘనంగా జరుపుకునే ఈ పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా గత ఏడు రోజుల్లో మద్యం విక్రయాలు రూ.1,100 కోట్...
తెలంగాణ రాష్ట్ర సమితిని BRSగా మార్చిన తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ రెడ్డి సహా…పలువురు నేతలు ఢిల్లీ వెళ్లి EC అధికారులకి తీర్మానం కాపీని అందించారు. ఈ మేరకు పరిశీలించి అనుమతి ఇస్తామని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంధ్ర తెలిపారని..వినోద్ కుమార్ వెల్లడించారు. ఇప్పటికే TRS పార్టీని BRSగా మార్చుతూ నిన్న హైదరాబాద్లో కేసీఆర్ నేతృత్వ...
కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేసేశారు. టీఆర్ఎస్ గా తెలంగాణ కే పరిమితమైన పార్టీని… బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మార్చేశారు. పార్టీ పేరు అయితే మార్చారు.. కానీ.. ఆ తర్వాత ఏంటి అనే విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. జాతీయ పార్టీ అంటే… కేవలం ఒక్క రాష్ట్రానికే పరిమితం అయితే సరిపోదు. కనీసం రెండు, మూడు రాష్ట్రాల్లో పోటీ చేయాలి. అక్కడ కూడా క్యాండిడేట్స్ ని ఎంపిక చేయాల్సిన పని ఉంది. అంతేనా.. ...
బంగారం అక్రమ రవాణా కట్టడి కోసం అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పలువురు కేటుగాళ్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పేస్ట్ రూపంలో, బిస్కెట్లు, లోదుస్తులు, విగ్గుల్లో ఇలా పలు రకాలుగా బంగారాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రంయలో 7 కేజీల పుత్తడిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి కడ్డీల...
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ జోడో యాత్రలో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జోడో యాత్రను ఈ నెల ఆయన మొదలుపెట్టనున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ని ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలు విడుదల చేశారు. ఈ నెల 24న తెలంగాణలో రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభమై మొత్తం 13 రోజులు యాత్ర కొనసాగనుందని క...
మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో.. అన్ని పార్టీలు అక్కడ గెలిచేందుకు సన్నాహాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో… బీజేపీ నేత బండి సంజయ్ ఈ ఉప ఎన్నికపై మాట్లాడారు. మునుగోడులో బీజేపీ కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. ఆ గెలుపు తర్వాతే… దసరా, దీపావళి పండగలు చేసుకుందామంటూ పిలుపు నిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక ఫై ఆసక్తి నెల...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన ఆయన టీఆర్ఎస్ పార్టీని కాస్త… బీఆర్ఎస్ పార్టీగా మార్చేశారు. ఇక్కడితో అయిపోలేదు. జాతీయ పార్టీ కావడంతో… తీసుకునే నిర్ణయాలన్నీ ఢిల్లీ నుంచే జరగాలని ఆయన భావిస్తున్నారు. అందుకే.. ముందుగానే అక్కడ ఆఫీసు కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని డిప్లొమాట్ ఎవెన్యూలో కౌటిల్య మార్గ్, సర్దార్...
ప్రజా గాయకుడు గద్దర్ అంటే తెలియనివారు ఎవరూ ఉండరేమో. ఆయన పాటలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నోరు తెరిచి పాట పాడితే.. ఎవరికైనా ఊపు రావాల్సిందే. ఆయన… కేఏ పాల్ కి చెందిన ప్రజాశాంతి పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే… ఈ ప్రజాశాంతి పార్టీ కూడా మునుగోడు ఎన్నికల్లో పోటీ పడుతుండగా.. అభ్యర్థిగా గద్దర్ ని ఖరారు చేయడం గమనార్హం. ఇటీవల… కేఏపాల్.. కేసీ...
మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ హీరోకీ లేని ఫ్యాన్ బేస్ వీరికి ఉంది. అయితే.. వీరిద్దరూ కలిసి వేదిక పంచుకోవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. దీంతో.. వీరిద్దరూ కలిసి ఒకే వేదిక పంచుకుంటే బాగుంటుందని మెగా అభిమానులు ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. కాగా…నేడు అభిమానుల కోరిక నెరవేరనుంది. ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి ఒకే వేదిక పంచ...
ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో హాట్ గా నడుస్తున్న టాప్ ఏంటి అంటే… కాస్తో కూస్తో రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారు ఎవరైనా.. టీఆర్ఎస్ పార్టీ మార్పు అనే చెబుతారు. సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల దిశగా అడుగులు వేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా… టీఆర్ఎస్( తెలంగాణ రాష్టీయ సమితి) కాస్త… బీఆర్ఎస్( భారత్ రాష్ట్రీయ సమితి) గా మార్చారు. అయితే… ఇప్పటి వరకు టీఆర్ఎస్...