ప్రజా గాయకుడు గద్దర్ అంటే తెలియనివారు ఎవరూ ఉండరేమో. ఆయన పాటలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నోరు తెరిచి పాట పాడితే.. ఎవరికైనా ఊపు రావాల్సిందే. ఆయన… కేఏ పాల్ కి చెందిన ప్రజాశాంతి పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే… ఈ ప్రజాశాంతి పార్టీ కూడా మునుగోడు ఎన్నికల్లో పోటీ పడుతుండగా.. అభ్యర్థిగా గద్దర్ ని ఖరారు చేయడం గమనార్హం.
ఇటీవల… కేఏపాల్.. కేసీఆర్ పై ఆగ్రహంతో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అక్టోబర్ 2న తానునిర్వహించ తలపెట్టిన ప్రపంచ శాంతి మహాసభలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కేఏ పాల్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కేఏ పాల్ నిరాహార దీక్షా శిబిరానికి వచ్చిన గద్దర్ నిమ్మరసం తాగించి పాల్‌తో దీక్ష విరమింపజేశారు. ప్రజాశాంతి తరపున మునుగోడు ఉప ఎన్నికల బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. రేపటి నుంచి మునుగోడులోని విస్తృతంగా ప్రచారం చేస్తానని చెప్పారు.
నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అక్టోబర్ 7 నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కానుంది. అక్టోబర్ 14న తేదీ నామినేషన్లు స్వీకరించడానికి ఆఖరు తేదీ. ఆ తర్వాతి రోజున నామినేషన్ల పరిశీలన జరగనుంది. అక్టోబర్ 17 నామినేషన్లు ఉప సంహరించుకోడానికి ఆఖరి తేదీగా ఎన్నికలు అధికారులు ప్రకటించారు.