MBNR: ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలలో పాల్గొనాలని జిల్లా డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం రాత్రి రాజాపూర్ మండలం పల్లి గ్రామంలో ఎన్నికలపై ప్రజలు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై శివానందం గౌడ్ పాల్గొన్నారు.