సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గ పదో తరగతి విద్యార్థులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ శుభవార్త తెలిపారు. నియోజకవర్గంలోని 2,087 మంది విద్యార్థుల పరీక్ష ఫీజు రూ.2,60,875లను మంత్రి తన జీతం నుంచి చెల్లించారు. నియోజకవర్గ బీజేపీ నేత హరీష్ బాబు సంబంధిత చెక్కును మంగళవారం మండల విద్యాశాఖాధికారులు అందజేశారు.