టాలీవుడ్ నటి సమంత ఇటీవల దర్శక నిర్మాత రాజ్ నిడిమోరుని కోయంబత్తూర్ ఇషా ఆశ్రమంలో పెళ్లి చేసుకుంది. సమంత, రాజ్ పెళ్లి ఫొటోలు రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమంత తన భర్త ఫ్యామిలీతో దిగిన ఫ్యామిలీ ఫొటో ప్రస్తుతం వైరల్గా మారింది. రాజ్ నిడిమోరు సోదరి శీతల్ నిడిమోరు ఈ ఫ్యామిలీ ఫొటోని షేర్ చేసింది.