ATP: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాలలో ఈనెల 8న పీఎం అప్రెంటిష్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాయప్పరెడ్డి మంగళవారం తెలిపారు. పదో తరగతి, ఐటీఐ మార్పుల జాబితాలు, ఆధార్ కార్డు, రెండు ఫొటోలు, కుల ధ్రువీకరణ పత్రం తీసుకు రావాలన్నారు. అర్హత ఆధారంగా ఆయా కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.