శ్రీలంకలో ‘దిత్వా’ తుఫాను విలయం సృష్టిస్తోంది. వరద బీభత్సానికి మృతుల సంఖ్య 465కు చేరగా, మరో 366 మంది గల్లంతయ్యారు. కష్టకాలంలో లంకకు భారత్ అండగా నిలిచింది. ‘ఆపరేషన్ సాగర్ బంధు’ చేపట్టి.. తక్షణ సాయంగా 53 టన్నుల నిత్యావసర సరుకులను పంపించింది. పక్క దేశానికి ఆపద వస్తే ముందుంటామని భారత్ మరోసారి నిరూపించుకుంది.