KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరిగిన బీఈడీ 4వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. రెగ్యులర్ కింద 3,225 మందికి గాను 3,121 మంది, సప్లిమెంటరీలో 122కు 118 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు. ఫలితాల కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలన్నారు.