GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేదికగా 2025-2026 యువజన ఉత్సవాలు ఈనెల 6, 7, 8 తేదీలలో జరుగుతాయని మంగళవారం యువజన ఉత్సవాల కోఆర్డినేటర్ మురళీమోహన్ తెలిపారు. మ్యూజిక్, డాన్స్, లిటరరీ ఈవెంట్స్, థియేటర్, ఫైన్ ఆర్ట్స్ వంటి అంశాలలో పోటీలు ఉంటాయని చెప్పారు. వర్సిటీలోని కళాశాలలతో పాటు, అనుబంధ కళాశాల విద్యార్థులు యువజన ఉత్సవాల్లో పాల్గొనాలని సూచించారు.