ELR: కలిదిండి మండలంలో మంగళవారం శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి పనుల సమీక్ష సమావేశం జరిగింది. కార్యక్రమంలో MLA కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. గొప్ప చరిత్ర కలిగిన దేవాలయాలను నిత్యం అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం ఎక్కువ నిధులు వెచ్చించి పాత బడిన దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకువస్తుందని తెలిపారు.