KDP: చిట్వేలి మండలం లక్ష్మీపురం ST కాలనీకి చెందిన పంజాపి వెంకటరమణ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కాలు విరిగింది. పేద కుటుంబానికి చెందిన వెంకటరమణకు చికిత్సకు లక్ష రూపాయలు అవసరం. ప్రమాదానికి కారణమైన వారు రూ. 20వేలు సహాయం చేసినా, మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.