MDK: రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సర్పంచ్ స్థానాన్ని అన్ రిజర్వుడ్ మహిళకు కేటాయించారు. సర్పంచ్ స్థానానికి 9 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు ప్రకటించారు. 8 వార్డు సభ్యులకు గాను, 17 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు ప్రకటించారు. రేపు స్కూటీని నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు.