AKP: చోడవరం సంజీవనీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సమీపంలో మంగళవారం నిలిపి ఉన్న కారును టిప్పర్ లారీ ఢీకొట్టింది. పేషెంట్‌ను దిగేందుకు కారు హాస్పిటల్ వద్ద ఆగి ఉండగా వేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి దూసుకొచ్చి ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు జరగకపోవడం స్థానికులకు ఉపశమనం కలిగించింది.