KRNL: కర్నూలు-బళ్లారి హైవే ఏర్పాటుకు కేంద్ర మద్దతు కోరుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్, కర్నూలు ఎంపీ నాగరాజు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరిని మంగళవారం న్యూఢిల్లీలో కలిసి చర్చించారు. ఏపీ-కర్ణాటకలను అనుసంధానించే ఈ హైవే వాణిజ్యం, పర్యాటకం, ప్రాంతీయ అభివృద్ధికి దోహదం చేస్తుందని వివరించారు. హైవే ప్రతిపాదనపై గడ్కరి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.