VSP: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో సీపీ శంఖబ్రత బాగ్చితో కలసి రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. హైవేలో జీబ్రా క్రాసింగ్ వద్ద సోలార్ బ్యాంకర్లు ఏర్పాటు చేయాలన్నారు. మేజర్ రోడ్లలో, పాఠశాలల వద్ద స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు చేయాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించారు.