ATP: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) పరిధిలో జరుగుతున్న డిగ్రీ 3, 5 సెమిస్టర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ముగ్గురు విద్యార్థులను డిబార్ చేసినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ తెలిపారు. అనంతపురంలోని ఎస్ఎల్ఎన్ డిగ్రీ కళాశాలలో ఇద్దరు, గుంతకల్లులోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఒక విద్యార్థిని డిబార్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.