VSP: లింగంపల్లి- విశాఖపట్నం జన్మభూమి ట్రైన్ నెంబర్ను 12805/12806 నుంచి 18501/18502కి 2026 ఫిబ్రవరి 15 నుంచి మారబోతుందని రైల్వే అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ మార్పుని నిలిపివేస్తున్నట్లు రైల్వే అధికారులు తాజాగా మరో ప్రకటనలో తెలిపారు. కావున ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరారు.