NZB: ఆలూరులో పుల్లెల రాముకు చెందిన తాళం వేసిన ఇంట్లో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు నవంబర్ 27న ఊరికి వెళ్లగా, మంగళవారం సాయంత్రం తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి, బీరువా ధ్వంసం చేశారు. ఈ చోరీలో 14 తులాల బంగారం, సుమారు అర కిలో వెండి, లక్ష నగదును దొంగిలించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.