MDK: విద్యార్థులకు శిక్షణ అందిస్తే, జాతి గర్వించే స్థాయిలో అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుందని డీఈవో విజయ పేర్కొన్నారు. తూప్రాన్ మండలం ఘనపూర్ హైస్కూల్లో ఇంట్రమురల్ క్రీడల ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పదవ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో డాక్టర్ సత్యనారాయణ, క్రీడా అధికారి రమేష్ గంగాల పాల్గొన్నారు.