BDK: కొత్తగూడెం ఎర్త్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య నిన్న కలిసి వినతిపత్రం ఇచ్చారు. గిరిజన పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని, కొమరారం, బోడు ప్రాంతాలను మండలాలుగా, చారిత్రక ఇల్లందును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని సీఎం ను కోరారు. సీతారామ ప్రాజెక్టు జలాలను రైతులకు అందించాలన్నారు.