VSP: కూటమి ప్రభుత్వం హామీలు విస్మరించి ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. మంగళవారం విశాఖలోని సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.1500 హామీలు అమలు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల అప్పుడు ఇచ్చిన హామిలు అన్ని గాలిలో దీపం లాంటివని అవేదన వ్యక్తం చేశారు.