బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. అయితే ఇది అనూహ్యంగా దిశ మార్చుకుంది. దక్షిణ దిశగా కదులుతూ.. క్రమంగా నైరుతి వైపు పయనించి బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.