KRNL: డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం ప్రాణాంతకమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం హెచ్చరించారు. జనవరి నుంచి నవంబర్ 30 వరకు జిల్లాలో 925 మొబైల్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించి, రోడ్డు నియమాలు పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.