ASF: నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల నిర్మాణాలను 100% ప్రారంభించాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే సూచించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి ప్రకాష్ రావుతో కలిసి కాగజ్ నగర్, ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలో చేపట్టవలసిన ఇందిరమ్మ ఇళ్ల పనులపై సమీక్ష నిర్వహించారు.