E.G: రాష్ట్రంలో వాయు కాలుష్యం తక్కువ ఉన్న నగరాల్లో రాజమహేంద్రవరం ప్రథమస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని మంగళవారం లోక్సభలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ప్రకటించారు. రాజమహేంద్రవరంలో ధూళికణాలు 2017-18లో, 85 మైక్రో గ్రాములు ఉండగా.. 2024-25 నాటికి 59 మైక్రోగ్రాములకు తగ్గినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 10 నగరాల్లో కాలుష్యం తగ్గిందన్నారు.