E.G: ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ టూరిజానికి ప్రోత్సాహం అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం ప్రకటించారు. ఏపీని దేశంలోనే సినిమా షూటింగ్లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా మారుస్తామన్నారు. ఇందులో భాగంగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. విశాఖ బీచ్లు, గోదావరి నదీ తీరాలు, అరకు వంటి ప్రదేశాలు ఉన్నాయన్నారు.