HYD: హాస్టళ్లలో నాసిరకం, పాడైపోయిన భోజనం పెడుతున్నారంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు నిన్న రాత్రి ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఆహారం సరిగా లేకపోవడం, కనీస మౌలిక వసతుల కొరతపై ఫిర్యాదు చేసినా వార్డెన్, ప్రిన్సిపల్ పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.