ELR: జిల్లాలో సీఎం, డిప్యూటీ సీఎం పర్యటన సమయంలో ప్రజల నుంచి స్వీకరించిన విజ్ఞాపనలను తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ వెట్రిసెల్వి మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో సహా వివిధ సమస్యలపై అందిన దరఖాస్తులకు సంబంధించి, నిబంధనల ప్రకారం అయ్యే వ్యయంపై ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని సూచించారు.