SRPT: మద్యం తాగి ఖాళీ సీసాలను కాలువలు, పంట పొలాల్లో వేయడం వల్ల పొలం పనులు చేసే రైతులకు, కూలీలకు గాయాలవుతున్నాయని, ఫిర్యాదులు వస్తున్నాయని జిల్లా ఎస్పీ నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగంగా మద్యం సేవించడం, ఖాళీ సీసాలలో పంట పొలాల్లో పడి వేయడం మంచి లక్షణం కాదని సూచించారు.