GNTR: కాల్ మనీ వ్యాపారాల కారణంగా ఇబ్బందులు పడుతున్న చిరు ఉద్యోగులను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రత్తిపాడు MLA బూర్ల రామాంజనేయులు తెలిపారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో సుమారు 2,400 మంది ఉద్యోగులు వడ్డీ వ్యాపారాల వల్ల సమస్యలకు గురవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు అండగా ఉంటామన్నారు.