NLG: చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో నిషేధిత ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలని స్థానిక ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు మున్సిపల్ అధికారులను కోరారు. డిసెంబర్ 2, కాలుష్య నివారణ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం మధ్యాహ్నం విద్యార్థులు మున్సిపల్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పెద్ది నరేందర్ మాట్లాడారు.