అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట సాధన ఉద్యమం తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాజంపేటలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు జేఏసీ ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం పాత బస్టాండ్ నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం సమర్పించనుంది. ప్రజలు భారీ ఎత్తున పాల్గొనాలని జేఏసీ పిలుపునిచ్చింది.