RR: ఇబ్రాహీంపట్నానికి చెందిన సురేశ్ బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నేతాజీ సుభాష్ సదర్న్ సెంటర్‌లో డిసెంబర్ 2025- జనవరి 2026 మధ్య నిర్వహించిన ఎన్‌ఐఎస్ (ఖో-ఖో) కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. తెలంగాణ నుంచి పాల్గొన్నది ఆయన ఒక్కరే కావడం విశేషం. ప్రస్తుతం ఓ ప్రైవేట్ కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
SRCL: తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఐఏఎస్ బదిలీలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా గరిమ అగ్రవాల్, ఐఏఎస్ (2019) నియమితులయ్యారు. ప్రస్తుతం అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమెను కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో పరిపాలన మరింత వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
NLG: రంజాన్ మాసం సందర్భంగా నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమంపై అధికారులు ముస్లిం పెద్దలతో ఇవాళ నకిరేకల్లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వేముల వీరేశం సమీక్ష జరిపారు. సోదర భావంతో శాంతియుత వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగేందుకు అధికారులు ముస్లిం సోదరులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.
BHNG: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. భువనగిరి కలెక్టర్ హనుమంతరావు బదిలీ అయ్యారు. ప్రభుత్వం ఆయనను దేవదాయ శాఖ డైరెక్టర్ నియమించింది. గోదావరి పుష్కరాలకు ప్రత్యేక అధికారిగానూ అపాయింట్ అయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో అదనపు బాధ్యతలు నిర్వహించిన హరీష్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
SDPT: చేర్యాల పట్టణ కేంద్రంలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి శుక్రవారం పర్యటించనున్నట్లు బీఆర్ఎస్ పట్టణ నాయకులు తెలిపారు. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు మండలాల వారికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, చేర్యాల నూతన కౌన్సిలర్ల పదవీ స్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారని పేర్కొన్నారు.
MDK: కూలీలకు ఉపాధి కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చిందని కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి సర్పంచ్ పాతూరి దయాకర్ తెలిపారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గురువారం ఊసన్ కుంట చెరువు కట్ట పునరుద్ధరణ పనులను ఆయన ప్రారంభించారు. ఉప సర్పంచ్ గుండు నాని, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
BDK: త్వరలోనే ఎలాంటి రద్దీ లేకుండా టెన్షన్ ఫ్రీ జర్నీ చేయొచ్చు. ఈ మేరకు ఆర్టీసీకి కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. మహిళా సంఘాల సమాఖ్యల నుంచి ఆర్టీసీ అద్దె ప్రతిపాదికన బస్సులను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఈ బస్సులను నడుపుతుండగా సుమారు 200 బస్సులు రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యాయి.
KNR: గంగాధర మండలం కురిక్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యదర్శి ప్రభాకర్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా సహకార అధికారి సీహెచ్ మనోజ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల దుర్వినియోగం, ఎరువుల కొనుగోలులో అవకతవకలు, రుణాల వసూలులో పాత ఓచర్ల డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేశారు. రామడుగు కార్యదర్శికి అదనపు బాధ్యతలు అప్పగించారు.
SRPT: మునగాల మండలం రేపాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా, గ్రామానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పింగళి ఉపేందర్, కందిబండ సురేష్ కలిసి లక్ష్మీనరసింహస్వామి సేవకులకు టీషర్ట్స్‌ను ఆలయ ఛైర్మన్ సారిక చిన్న రామయ్యతో అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ మాట్లాడుతూ.. స్వామివారి సేవకులకు టీషర్ట్స్ అందజేసిన ఉపేందర్, సురేష్‌ను అభినందించినారు.
NRPT: ప్రభుత్వం రక్షణ చట్టం తేవాలని న్యాయవాదులు గురువారం నారాయణపేట జిల్లా కోర్టు నుంచి రాష్ట్ర సచివాలయం వరకు మహా పాదయాత్ర చేపట్టారు. కాళేశ్వర్, మోహన్యాదవ్, మహేష్ యాదవ్, రాములు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ యాదవ్ మాట్లాడుతూ.. రేపటిలోగా న్యాయవాదుల చట్టం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించారు.
HYD: ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని అన్నారం గ్రామంలో ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ద్వారానే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందన్నారు.
BHPL: చిట్యాల(M) నవాబుపేట గ్రామానికి చెందిన PACS మాజీ డైరెక్టర్ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సతీమణి రమ క్యాన్సర్ వ్యాధితో అనారోగ్యానికి గురై ఈ రోజు మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి, BRS జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మృతురాలి నివాసానికి వెళ్లి ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. BRS నేతలు ఉన్నారు.
RR: చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఆయన నివాసంలో BJP నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా OBC మోర్చా నాయకుడు బోయిని మహేష్ యాదవ్ MPకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పలువురు పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆదిలాబాద్ నలంద కళాశాలలో మార్చి 1న ఫౌండేషన్ కోర్సు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత కుమారి పేర్కొన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వారు వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లు పొందవచ్చు. పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని, అభ్యర్థులు సకాలంలో హాజరుకావాలని కోరారు. సమాచారం కోసం 9494149416 నంబర్‌కు సంప్రదించాలని వెల్లడించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటనలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, చిన్నారి మృతిపై జిల్లా SP సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతుండగా, నమోదైన కేసులు, అరెస్టయిన నిందితుల వివరాలను ఆయన వెల్లడించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఈ సున్నితమైన అంశంపై ఆసక్తి నెలకొంది.