• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

లైబ్రరీ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించిన నాయకులు

NGKL: కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేయనున్న లైబ్రరీ భవన నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ షానవాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చొరవ వల్ల లైబ్రరీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు అయినట్లు వారు తెలిపారు.

February 26, 2026 / 01:42 PM IST

పెద్ద రేవల్లి స్టోన్ కంపెనీపై ఫిర్యాదు

MBNR: బాలానగర్ మండలం పెద్ద రేవల్లి గ్రామంలో శ్రీ తిరుమలనాథ దేవస్థానం సమీపంలో స్టోన్ కంపెనీ దుమ్ము కారణంగా గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా మారి మూగజీవాలు చనిపోతున్నాయి. వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరారు.

February 26, 2026 / 01:41 PM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థులకు గాయాలు

HNK: ఎల్కతుర్తి మండలంలోని మోడల్ స్కూల్ సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇంటర్ పరీక్షలు రాసి ఇంటికి వెళ్తున్న విద్యార్థుల బైకులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని MGM ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 26, 2026 / 01:41 PM IST

రైతుల రిజిస్ట్రేషన్‌కు గడువు ఇంకా రెండు రోజులే ..!

SRPT: రైతు రిజిస్ట్రేషన్‌కు ఈ నెల 28వ తేదీ వరకు మాత్రమే గడువు ఉంటుందని అనంతగిరి మండల వ్యవసాయ అధికారి సతీష్ తెలిపారు. మండలంలో ఇంకా 5,020 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉందన్నారు. రిజిస్ట్రేషన్ లేని రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల లబ్ధి అందదని ఆయన స్పష్టం చేశారు. వెంటనే రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రైతులకు సూచించారు.

February 26, 2026 / 01:40 PM IST

ఘనంగా బొడ్రాయి 8 వ వార్షికోత్సవం

RR: శంషాబాద్ మండలం, నర్కూడ గ్రామంలో ఇవాళ బొడ్రాయి ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా, గ్రామ సర్పంచ్ శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా బొడ్రాయికి అభిషేకం చేసి, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నర్కూడ గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

February 26, 2026 / 01:37 PM IST

సర్పంచుల శిక్షణ కార్యక్రమం ముగింపు: కలెక్టర్

NRPT: ఉట్కూర్ మండలంలోని రెండో బ్యాచ్ నూతన సర్పంచులకు ఐదు రోజులపాటు నిర్వహించిన ఓరియంటేషన్ శిక్షణ ముగిసింది. ముగింపు వేడుకలకు కలెక్టర్ సిక్త పట్నాయక్, డీపీవో హాజరై సర్పంచులకు దిశానిర్దేశం చేశారు. పలు గ్రామాల సర్పంచులతో పాటు మల్లేపల్లి సర్పంచ్ కతలప్ప మాట్లాడుతూ.. గ్రామ పాలన, నిధుల వినియోగంపై అవగాహన కలిగిందని అన్నారు.

February 26, 2026 / 01:37 PM IST

మున్సిపల్ అభివృద్ధికి నిధుల కోసం వినతి

SRD: నారాయణఖేడ్ మున్సిపల్ అభివృద్ధికి కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు కేటాయించాలని జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ శెట్కార్ కోరారు. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని గురువారం కలిశారు. జాతీయ రహదారి 161 (బీ) నిజాంపేట్-నారాయణఖేడ్ మీదుగా చేపడుతున్న పనులతో పాటు కర్ణాటక సరిహద్దులో మిగిలిన 8 కిలోమీటర్ల రహదారికి నిధులు కేటాయించాలని కోరారు.

February 26, 2026 / 01:36 PM IST

నగరంలో కోకోపిట్, కెమికల్స్‌తో నకిలీ టీ పౌడర్

HYD: నకిలీ టీ పౌడర్ తయారు చేస్తూ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు జగన్నాథ్ పట్టుబడ్డాడు. సింథటిక్ రసాయనాలతో టీ పౌడర్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఒక కిలో కల్తీ టీ పొడికి 450 గ్రాముల నాణ్యతలేని టీ డస్ట్ ఉపయోగిస్తున్నారని, 500 గ్రాముల నాణ్యతలేని గ్రాన్యూల్స్‌తో పాటు 50 గ్రాముల రంగు కలిపిన కోకోపీట్ మిక్స్ వాడుతున్నట్లు గుర్తించారు.

February 26, 2026 / 01:36 PM IST

ప్రజా సమస్యల పరిష్కారాననికి వినతి

SRD: పటాన్చెరు నియోజకవర్గం భారతీనగర్ డివిజన్ పరిధిలోని పలు ప్రజా సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి కోరారు. ఈ మేరకు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజనను కలిసి వినతి పత్రం అందజేశారు. బాంబే కాలనీ రైతు బజార్‌లో సింగిల్-బిడ్ దుకాణాలను మహిళా స్వయం సహాయక సంఘాలు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలకు 22 నాన్-టెండర్ దుకాణాలను కేటాయించాలని కోరారు.

February 26, 2026 / 01:35 PM IST

కాంగ్రెస్‌లో చేరిన పురాణీపేట్ సర్పంచ్

NZB: భీమగల్ మండలంలోని పురాణీపేట్ సర్పంచ్ బుర్ర సుమ ఆమె భర్త దేవేందర్ గౌడ్ గురువారం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. బాల్కొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన, అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

February 26, 2026 / 01:35 PM IST

విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

VKB: ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వివిధ పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సకాలంలో పరీక్షా కేంద్రాలకు వెళ్లే విధంగా బస్సులను ఏర్పాటు చేసినట్లు వికారాబాద్ బస్ డిపో మేనేజర్ నమ్రత తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి.

February 26, 2026 / 01:34 PM IST

బాల్క సుమన్ బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా

MNCL: క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బెయిల్ పిటిషన్‌ను మంచిర్యాల జిల్లా న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్, సుమన్‌కు సంబంధించిన న్యాయవాదుల వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత రేపటికి వాయిదా వేస్తూ తీర్పు వెలువరించారు.

February 26, 2026 / 01:32 PM IST

మనోహరాబాద్‌లో యథేచ్ఛగా మట్టి రవాణా.. !

MDK: మనోహరాబాద్ మండలంలో అక్రమ మట్టి రవాణా జోరుగా సాగుతోంది. ఓ ప్రైవేట్ వెంచర్లో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తూ అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని, పగలు, రాత్రి తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలన్నారు.

February 26, 2026 / 01:31 PM IST

న్యాయవాదుల మహా పాదయాత్ర ప్రారంభం

NRPT: న్యాయవాదులు రక్షణ చట్టం కోసం గురువారం నారాయణపేట కోర్టు నుంచి రాష్ట్ర సచివాలయం వరకు పాదయాత్ర ప్రారంభించారు. కాళేశ్వర్, మోహన్యాదవ్, మహేష్ యాదవ్, రాములు పాల్గొన్నారు. కేంద్ర న్యాయవాది రఘువీర్ యాదవ్ ప్రభుత్వం వెంటనే చట్టం తీసుకోవాలని.. లేని పక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

February 26, 2026 / 01:31 PM IST

గురుకుల విద్యార్థులకు కంటి పరీక్షలు

KMR: లింగంపేట మైనారిటీ గురుకుల పాఠశాలలో గురువారం విద్యార్థులకు కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ప్రిన్సిపల్ వెంకట రాములు పర్యవేక్షణలో వైద్యులు హరికిషన్ విద్యార్థులకు పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. దృష్టి లోపం ఉన్న వారికి త్వరలోనే కళ్లద్దాలు అందజేస్తామని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ క్రాంతి, నర్సింగ్ ఆఫీసర్ పాల్గొన్నారు.

February 26, 2026 / 01:31 PM IST