BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలో నల్లాల బావి దగ్గర మోటార్ పాడైపోవడంతో గురువారం GP కార్యదర్శి రంజిత్, 5వ వార్డు మెంబర్ రాజేందర్, 6వ వార్డు మెంబర్ సురేష్, GP పంప్ ఆపరేటర్ అంజి గురువారం మరమ్మతు పనులు చేపట్టారు. ఈ సందర్భంగా వార్డు మెంబర్ రాజేందర్ మాట్లాడుతూ.. రానున్న వేసవిలో తాగునీటి సమస్య ఇబ్బంది కలగకుండా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
KMM: జిల్లా వెలగమట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల కూల్చివేత బాధితులను BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ పరామర్శించారు. వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదవారి ఇళ్లను కూల్చడమా? ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు పత్రాలు, కాగా కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ, కనీస నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను ధ్వంసం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.
JN: జాతీయ రహదారి నిర్మాణంలో ప్లాట్లు కోల్పోతున్న బాధిత ప్లాట్ యజమానుల రిలే దీక్షకు 3వ వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి మద్దతు తెలిపారు. కౌన్సిలర్ మాట్లాడుతూ.. జనగామ పట్టణంలో ఏకశిలా గడ్డకు ప్లాట్లు కోల్పోతున్న భూ-యజమానులు నష్టపరిహారం ఇవ్వాలని, వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.
BDK: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యావత్ భారతదేశం మొత్తంలో ఉన్న బంజారా ప్రజలను ఏకం చేసి సన్మార్గాన్ని చూపించిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు.
MDCL: ఉప్పల్ మీడియా క్లబ్ నూతన కమిటీని మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తన నివాసంలో సత్కరించారు. సీనియర్ జర్నలిస్టు వడ్డేపల్లి కిషోర్ నేతృత్వంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఐక్యంగా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కమిటీ సేవా కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని, అవసరమైన సదుపాయాల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
SRPT: హుజూర్నగర్ పట్టణ యాదవ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా గెలుపొందిన జక్కుల మల్లయ్య, మోదాల కామేశ్వరి, కోడి జ్యోతి, కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన సుంకరి శివరామ్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి, యాదవ సంఘ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేయాలని తెలిపారు.
MDK: మనోహరాబాద్ మండలం రామాయపల్లి ఇండస్ మెడికేర్ కంపెనీలో ‘Arrive అండ్ Alive’ 2వ దశ కార్యక్రమం నిర్వహించారు. తూప్రాన్ సీఐ రంగాకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటించడం, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై అవగాహన కల్పించారు.
PDPL: సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాలు చేయాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. GDK తిలక్ నగర్ ఆఫీస్‌లో గురువారం సింగరేణి పరిరక్షణ- కార్మిక హక్కులపై సమావేశం నిర్వహించారు. రియాజ్ అహ్మద్, రాజన్న, విశ్వనాథ్ మాట్లాడుతూ.. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలన్నారు.
MHBD: తొర్రూర్(M) ఆర్యభట్ట ప్రైవేట్ స్కూల్లో దారుణం చోటుచేసుకుంది. పెద్దవంగర తండాకు చెందిన ఓ విద్యార్థిని పాఠశాల యాజమాన్యం నోట్లో తువాల కుక్కి, స్లాబ్‌కు వేలాడదీసి చంపే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది చూసిన మరో విద్యార్థి ఆ విద్యార్థి ప్రాణాలను కాపాడినట్లు తెలుస్తోంది. కొత్తగా కట్టే స్కూలుకు పిల్లలను బలి ఇవ్వాలని యాజమాన్యం ఆలోచన చేసినట్లు సమాచారం.
BHNG: భువనగిరి పట్టణాన్ని సుందరీకరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతామని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన తంగెళ్ళపల్లి శ్రీవాణి, వైస్ ఛైర్‌పర్సన్‌గా పోతంశెట్టి మంజుల పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. పట్టణంలోని అన్ని రోడ్లను పూర్తిగా అభివృద్ధి చేస్తామన్నారు.
JGL: రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామ ప్రజల నిరీక్షణకు తెరపడింది. గత ఏడాది కాలంగా గ్రామానికి కోరుట్ల డిపోకు చెందిన బస్సు సర్వీస్ నిలిపివేయబడగా, గురువారం సర్వీస్‌ను మళ్లీ పునరుద్ధరించారు. డిపో మేనేజర్ తీసుకున్న నిర్ణయంతో బస్సు రాకపోకలు తిరిగి ప్రారంభం కావడం వల్ల గ్రామస్తులు, విద్యార్థులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
MNCL: చెన్నూర్ మండల కేంద్రంలో కొనసాగుతున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ADB: నేరడిగొండ మండల కేంద్రంలోని రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన కల్వర్టు నిర్మాణానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గురువారం స్థానికులతో కలిసి పూజ చేశారు. కల్వర్టు నిర్మాణంతో వ్యవసాయ పొలాలకు వెళ్ళటానికి రైతులకు ఇబ్బందులు దూరం అవుతాయని అన్నారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు.
NLG: శ్రీ మార్కండేశ్వర స్వామి జాతర వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. ‘ఓం నమశ్శివాయ’ నామస్మరణతో గ్రామం ఆధ్యాత్మికతతో నిండిపోయింది. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అగ్నిగుండాలలో నడిచి మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
HYD: మూసీ పునరుజ్జీవనంపై సర్కారు పట్టుదలతో ఉన్నా, నిధుల వేట సవాలుగా మారింది. రూ.17 వేల కోట్ల మాస్టర్ ప్లాన్‌కు కేంద్ర బడ్జెట్‌లో ఆశించిన మద్దతు లభించలేదు. దీంతో ప్రాజెక్టు అమలులో జాప్యం జరిగేలా కనిపిస్తోంది. సర్వేలు పూర్తయినా, భూసేకరణ, పునరావాసంపై స్పష్టత రావాల్సి ఉంది.