• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మెదక్ జిల్లాకు టెన్త్ మూల్యాంకన కేంద్రం కేటాయింపు

మెదక్ జిల్లాకు ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకన కేంద్రాన్ని కేటాయిస్తూ రాష్ట్ర పరీక్షల విభాగం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈఓ ఏ.విజయ తెలిపారు. జిల్లాలోనే కేంద్రం ఏర్పాటు కావడం వల్ల స్థానిక ఉపాధ్యాయులకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని ఆమె పేర్కొన్నారు. కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్‌కు ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

February 25, 2026 / 07:48 PM IST

విజేతలను ప్రత్యేకంగా అభినందించిన.. జిల్లా SP

MLG: HYDలో జరిగిన 4వ తెలంగాణ పోలీస్ క్రీడల్లో ములుగు జిల్లా పోలీసులు సత్తా చాటారు. రెజ్లింగ్ 63 కేజీల విభాగంలో అమిత్ కుమార్ సింగ్ సిల్వర్ పతకం సాధించగా, జూడోలో 81 కేజీలు, 82 కేజీల విభాగాల్లో మేకల నాగరాజు రెండు సిల్వర్ పతకాలు గెలిచారు. ఈ విజయాలతో ములుగు జిల్లా పోలీసులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటారు. MLG SP కార్యాలయంలో SP విజేతలను అభినందించారు.

February 25, 2026 / 07:48 PM IST

దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలి : కలెక్టర్

మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలోని వ్యవసాయ రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యుల ఓరియంటేషన్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముందుగా దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలని అన్నారు. గ్రామాల అభివృద్ధికి స్థానిక పాలకవర్గం సమర్థవంతమైన పాలన అందించాలన్నారు.

February 25, 2026 / 07:42 PM IST

రేపటి నుంచి పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

NZB: టీయు పరిధిలో (MA/MSW/MCom/MSc/MBA/MCA), ఇంటిగ్రేటేడ్ పీజీ (APE/PCH/IMBA) మొదటి, IMBA 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు COE ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 26 నుంచి మార్చి 11 వరకు మధ్యాహ్నం 2 గం.ల నుంచి 5గం.ల వరకు జరగనున్నాయన్నారు. ఫిబ్రవరి 26, 28, మార్చి 2, 4, 6, 9, 11 తేదీల్లో నిర్వహించనున్నారు.

February 25, 2026 / 07:40 PM IST

కానిస్టేబుల్‌పై దాడి.. ముగ్గురు అరెస్టు

SRCL: వేములవాడ పట్టణంలోని జాతర గ్రౌండ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి విధుల్లో ఉన్న బ్లూ కోట్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడిన ఘటనలో పవన్ కళ్యాణ్, రాహుల్, సుమన్ అనే ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు VMD పట్టణ సీఐ వీరప్రసాద్ తెలిపారు. ప్రజలు రాత్రి వేళల్లో అనవసరంగా గుమిగూడినా, అవసరం లేకున్నా బైక్ పై తిరిగినా చట్టప్రకారం చర్య తీసుకుంటామన్నారు.

February 25, 2026 / 07:39 PM IST

హుజూర్‌నగర్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం

హుజూర్‌నగర్ పట్టణ అభివృద్ధిపై మున్సిపల్ ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. మురుగు నీటి పూడికతీత, వీధి దీపాల మరమ్మతులు, మంచినీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల మెరుగుకు నిధులు కేటాయించడంపై ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. లేఅవుట్ స్థలాల పరిరక్షణతో పాటు ఎన్ఎస్పీ సమీపంలో వరద కాలువ నిర్మించాలని సమావేశంలో చర్చించారు.

February 25, 2026 / 07:36 PM IST

రూ.43 కోట్ల నష్టం కలిగించిన ధాన్య మాఫియా అరెస్ట్

NLG: ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి సుమారు రూ.43 కోట్ల నష్టం కలిగించిన ఇద్దరిని జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు దోమలపల్లి గ్రామ శివారులో నిందితులను పట్టుకున్నాయి. అరెస్టు చేసిన కందుకూరి మహేందర్, కందుకూరి పద్మల వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.

February 25, 2026 / 07:34 PM IST

మండల వ్యవసాయ అధికారి సస్పెండ్

PDPL: ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో అవకతవకలు వెలుగులోకి రావడంతో పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కే.అలివేణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం జరిగిన తనిఖీల ఆధారంగా క్రమశిక్షణ చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.

February 25, 2026 / 07:34 PM IST

‘నర్సంపేటలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి’

WGL: నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యమని ఛైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ తెలిపారు. బుధవారం 4వ వార్డులో పర్యటించి లీకైన మిషన్ భగీరథ పైప్లైన్ మరమ్మతులు పూర్తి చేసి త్రాగునీటి సరఫరా పునరుద్ధరించినట్లు తెలిపారు. సీసీ రోడ్లు, సైడ్ కాలువలు సహా అభివృద్ధి పనులు చేపట్టి వార్డు సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

February 25, 2026 / 07:33 PM IST

లీడ్ బ్యాంకు మేనేజర్‌కు సన్మానం

KNR: ఈనెల 28న లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకట సీతా రామాంజనేయులు ఉద్యోగ విరమణ సందర్భంగా జిల్లా కేంద్రంలోని KDCCBలో సన్మాన కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల అమలు లక్ష్యంలో లీడ్ బ్యాంకు మేనేజర్ అందించిన సేవలను కొనియాడారు.

February 25, 2026 / 07:30 PM IST

గ్రంథాలయ భవనాన్ని పరిశీలించిన : రాయల నాగేశ్వరరావు

KMM: ముదిగొండలో శిథిలావస్థకు చేరిన గ్రంథాలయ భవనాన్ని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు పరిశీలించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ఉన్నారు. భవనం దుస్థితిని అడిగి తెలుసుకున్న నాయకులు త్వరలోనే మరమ్మతులు చేపట్టేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్టా ఉపేందర్ పాల్గొన్నారు.

February 25, 2026 / 07:28 PM IST

‘దివ్యాంగులకు బడ్జెట్‌లో 5% నిధులు కేటాయించాలి’

SRD: దివ్యాంగులకు బడ్జెట్లో 5% నిధులు ప్రత్యేకంగా కేటాయించాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కార్యదర్శి ఆడివయ్య డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో మీడియాతో బుధవారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 26 నెలలు అవుతున్న 6000 పింఛన్ ఇస్తామన్న హామీ అమలు చేయలేదని విమర్శించారు.

February 25, 2026 / 07:28 PM IST

400 ఏళ్ల కోనేరు శుభ్రపరిచిన సేవా ఫౌండేషన్

SDPT: దుబ్బాక మండలం ధర్మాజీపేటలో 400 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయ కోనేరును గ్రామ యువత పునరుద్ధరించారు. వేద సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిథిలావస్థకు చేరిన కోనేరును, ఆలయ పరిసరాలను యువకులు, పెద్దలు కలిసి ఉత్సాహంగా శుభ్రం చేశారు. మన సంస్కృతిని కాపాడుకోవాలనే లక్ష్యంతో ఈ పునఃప్రక్షాళన చేపట్టామని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సుతారి సందీప్ తెలిపారు.

February 25, 2026 / 07:26 PM IST

శిథిలావస్థకు చేరుకున్న పశువుల ఆసుపత్రి

BDK: జూలూరుపాడ్ మండలం గుండెపుడి గ్రామం నందు శిదిలావస్థలో ఉన్న పశువుల ఆసుపత్రి ని వెటర్నరీ డాక్టర్ సాయి సందీప్‌తో కలిసి దుద్దుకూరి సుమంత్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌తో సుమంత్ చరవాణి ద్వారా ఆసుపత్రి భవనం స్థితిగతులను వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే నూతన భవన నిర్మాణం చేపట్టాలని అధికారులు ఆదేశించారు.

February 25, 2026 / 07:22 PM IST

పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత

MDK: జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా అదనపు ఎస్పి మహేందర్ పేర్కొన్నారు. మెదక్ పట్టణంలోని పరీక్షా కేంద్రాలను మహేందర్ పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, మెడికల్ ఎమర్జెన్సీ టీములు, విద్యార్థులకు కల్పించిన కనీస వసతులను పరిశీలించారు.

February 25, 2026 / 07:21 PM IST