మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ హీరోకీ లేని ఫ్యాన్ బేస్ వీరికి ఉంది. అయితే.. వీరిద్దరూ కలిసి వేదిక పంచుకోవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. దీంతో.. వీరిద్దరూ కలిసి ఒకే వేదిక పంచుకుంటే బాగుంటుందని మెగా అభిమానులు ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. కాగా…నేడు అభిమానుల కోరిక నెరవేరనుంది. ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి ఒకే వేదిక పంచుకోనున్నారు. అయితే.. ఇది ఏ సినిమా ఫంక్షనో, పొలిటికల్ ఫంక్షనో కాదు. అలయ్-బలయ్ కార్యక్రమంలో..
ఇంతకీ మ్యాటరేంటంటే… విజయదశమి మరుసటి రోజున ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. కాగా, ఈ ఏడాది అలయ్ బలయ్ కార్యక్రమానికి ఇప్పటికే అన్ని పార్టీల నేతలకు, సినీ, వ్యాపార, సామాజిక ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. ఈ అలయ్ బలయ్ కార్యక్రమానికి సీనీ ప్రముఖుడు మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు హాజరవుతున్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు అన్నయ్య చిరంజీవి మద్దతు ప్రకటించిన తరువాత ఇద్దరూ ఒకే వేదికమీదకు వస్తుండటం విశేషం.
రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఈ అలయ్ బలయ్ కార్యక్రమానికి మెగస్టార్ చిరంజీవిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వ్యక్తిగతంగా ఆహ్వానించారు. చిరు, పవన్ అయితే కన్ఫామ్ గా వస్తున్నట్లు సమాచారం. మరి ఇతర పార్టీల నుంచి ఏయే నేతలు రానున్నారో.. ఎలాంటి ఆసక్తికర సంఘటనలు జరగనున్నాయో చూడాలి.