తెలంగాణ రాష్ట్ర సమితిని BRSగా మార్చిన తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ రెడ్డి సహా…పలువురు నేతలు ఢిల్లీ వెళ్లి EC అధికారులకి తీర్మానం కాపీని అందించారు. ఈ మేరకు పరిశీలించి అనుమతి ఇస్తామని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంధ్ర తెలిపారని..వినోద్ కుమార్ వెల్లడించారు. ఇప్పటికే TRS పార్టీని BRSగా మార్చుతూ నిన్న హైదరాబాద్లో కేసీఆర్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.
మరోవైపు మునుగోడు ఉపఎన్నికలో TRS పార్టీ పేరుతోనే పోటీచేయనునున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు BRS పేరుతో పోలిన ఇంకో మూడు పార్టీలు ఈసీ దగ్గర ఉన్నట్లు తెలిసింది. వాటిలో సికింద్రాబాద్ నుంచి బహుజన రాష్ట్ర సమితి, ముంబైకి చెందిన బహుజన రిపబ్లిక్ సోషలిస్ట్ పార్టీ ఉన్నాయి. వీటితోపాటు జైపూర్ భారతీయ రాష్ట్ర సమానతా వాది పార్టీలు కూడా ఈసీ వద్ద గుర్తింపు పొందకుండా పెండింగ్ లో ఉన్నాయి. ఈ క్రమంలో BRSగా మారనున్న TRS పరిస్థితి ఏంటో వేచి చూడాలి.